ఒక్క ట్వీట్ తో ఆలస్యంగా రావాల్సిన రైలు ముందే వచ్చింది.. ఎలా అంటే..

ఒక యువతి మధ్యాహ్నం 12 గంటలకు వారణాసిలో పరీక్ష రాయాల్సి ఉంది.అయితే ఆమె ఎక్కాల్సిన ట్రైన్ 6.30 గంటలకే చేరుకోవాల్సి ఉండగా 8 గంటలు దాటినా ఆమె ఎక్కే జంక్షన్ కు చేరుకోలేదు.దీంతో ఆ యువతీ పరీక్ష సమయానికి చేరుకోలేనేమో అని కంగారుపడిపోయింది.

 After Brother’s Tweet, Railways Runs Delayed Train At Full Speed,varanasi,nazi-TeluguStop.com

ఆ యువతి కష్టాన్ని రైల్వే శాఖ తీర్చింది.ఆ యువతి పరీక్షకు హాజరయ్యేలా చేసింది.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో బుధవారం రోజు చోటుచేసుకుంది.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంభందించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్ లోని మౌ ప్రాంతానికి చెందిన నజియా తాబస్సమ్ అనే ఒక యువతికి వారణాసిలో పరీక్ష ఉంది.ఆమె పరీక్షకు హాజరవ్వడానికి చప్రా నుండి వారణాసికి ఒక ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంది.

పరీక్ష మధ్యాహ్నం 12 గంటలకు.అయితే ఆమె బుక్ చేసుకున్న ట్రైన్ మౌ జంక్షన్ కు ఉదయం 6.25 గంటలకు చేరుకోవాలి.

కానీ మంచు ఎక్కువగా ఉండడం వల్ల ఆమె ఎక్కాల్సిన ట్రైన్ ఆలస్యంగా నడుస్తోంది.అందువల్ల ఆ ట్రైన్ మౌ జంక్షన్ కు ఉదయం 8 గంటలు దాటినా అక్కడకు చేరుకోలేదు.దీంతో పరీక్ష రాయలేనని భయపడిన నజియా తన సోదరుడు అన్వర్ జమీల్ కు ఫోన్ చేసి చెప్పింది.

అయితే ట్విట్టర్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే అన్వర్ ట్రైన్ ఆలస్యంగా నడుస్తున్న విషయాన్నీ చెప్తూ నార్త్ ఈస్ట్రన్ రైల్వే శాఖను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ పెట్టాడు.ఈ పరీక్ష ఆమె భవిష్యత్తుకు చాలా ముఖ్యమని తెలిపాడు.

ఈ ట్వీట్ కు వెంటనే స్పందించిన రైల్వే శాఖ ఆ ట్రైన్ ను స్పీడ్ గా నడిచేలా చేసింది.

రెండున్నర గంటలు ఆలస్యంగా నడిచిన ట్రైన్ వేగంగా ప్రయాణించి 11 గంటలకే వారణాసి చేరుకుంది.

దీంతో నజియా, అన్వర్ రైల్వే అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రైల్వే అధికారులను ప్రశంసలతో ముంచుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube