బోయపాటి సార్‌... నందమూరి ఫ్యాన్స్ నుండి మీకో రిక్వెస్ట్‌

After Balakrishna Akhanda Movie Fans Want More Movies Boyapati Combo Movies

నందమూరి బాలకృష్ణ కు సింహా మరియు లెజెండ్  సినిమా తర్వాత మరో విజయాన్ని బోయపాటి అందించాడు.బాలయ్య తో తన దర్శకత్వంలో బోయపాటి హ్యాట్రిక్ కొట్టాడు.

 After Balakrishna Akhanda Movie Fans Want More Movies Boyapati Combo Movies-TeluguStop.com

అద్బుతమైన విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను మళ్లీ ఫామ్‌ లోకి వచ్చినట్లుగా అనిపించాడు.గత సినిమా వినయ విధేయ రామ సినిమా మరీ దారుణమైన ప్లాప్‌ గా మిలిగింది.

ఆ సినిమా తర్వాత బోయపాటి తో సినిమా ను చేసేందుకు ఎవరు ముందుకు వస్తారు అనుకుంటున్న సమయంలో బాలయ్య వచ్చి తాను బోయపాటిని నమ్ముతున్నట్లుగా చెప్పాడు.బోయపాటి తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ చాలా కష్టపడ్డాడు.

 After Balakrishna Akhanda Movie Fans Want More Movies Boyapati Combo Movies-బోయపాటి సార్‌… నందమూరి ఫ్యాన్స్ నుండి మీకో రిక్వెస్ట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సోషల్‌ మీడియాలో బోయపాటి శ్రీను పలు సందర్బాల్లో స్పందిస్తూ తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందని చెప్పేవాడు.కాని ఆ సమయంలో ఆయనకు దారుణమైన ట్రోల్స్ వచ్చేవి.

బాలకృష్ణ మరియు బోయపాటిల కాంబో అంటే ఓ రేంజ్ లో ఉంటుంది అంటూ మరో సారి నిరూపితం అయ్యింది.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu-Movie

బాలకృష్ణ అఖండ సినిమా లో కనిపించిన తీరు చూస్తుంటే అభిమానులు ఇలాగే కోరుకున్నారు అనిపిస్తుంది.బాలకృష్ణ మరియు బోయపాటిల కాంబోలో ముందు ముందు మరిన్ని సినిమాలు వస్తాయని అనిపిస్తుంది.బాలకృష్ణ ను ఎలా చూపించాలో కేవలం బోయపాటి  శ్రీను కు  మాత్రమే తెలుసు.

కాస్త సమయం ఎక్కువ తీసుకున్నా కూడా అద్బుతమైన సినిమా ను బాలయ్య తో బోయపాటి తీయగలడు.అందుకే నందమూరి అభిమానులు మళ్లీ మళ్లీ బోయపాటి దర్శకత్వంలో సినిమాను బాలయ్య చేయాలని కోరుకుంటున్నారు.

అందుకు సంబంధించిన సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు.బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న తదుపరి సినిమా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది.

అదే అల్లు అర్జున్‌ హీరోగా రూపొందబోతున్న సినిమా ,అల్లు అరవింద్‌ స్వయంగా ఈ సినిమాను నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

బన్నీ సినిమా ఏమో కాని బాలయ్య తో మళ్లీ ఎప్పుడెప్పుడు అంటూ అప్పుడే చర్చ మొదలయ్యింది.

#Balakrishna #Akhanda #Boyapati Srinu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube