కాసేపట్లో అమరావతికి చంద్రబాబు..నెలకొన్న ఉద్రిక్తత

టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్ మరికాసేపటిలో అమరావతికి చేరుకోనుంది.ఈ క్రమంలో చిలకలూరిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

 After A While Chandrababu.. There Was Tension In Amaravati-TeluguStop.com

చిలకలూరిపేటలో జాతీయ రహదారిపై టీడీపీ నేతలు, కార్యకర్తలు బైటాయించారు.దీంతో చంద్రబాబు కాన్వాయ్ దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోయిందని తెలుస్తోంది.

నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై చంద్రబాబు లాఠీ ఛార్జ్ చేశారు.ఈ క్రమంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

మరోవైపు విజయవాడలోనూ టీడీపీ నేతలు, కార్యకర్తల ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.భారీ వాహనాలను రోడ్డుపై అడ్డంగా నిలిపిన టీడీపీ శ్రేణులు టైర్లను కాలుస్తూ సీఎం కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

అటు విజయవాడకు చేరుకున్న అనంతరం చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లనున్నారు.వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు.

ఈ నేపథ్యంలో ఆస్పత్రి మరియు కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube