ఎనిమిది నెలల తర్వాత సెట్‌ లో అడుగు పెట్టిన పవన్‌

కరోనా కారణంగా మార్చిలో సినిమాల షూటింగ్స్‌ మొత్తం ఆగిపోయాయి.మళ్లీ ఇన్నాళ్ల తర్వాత మెల్ల మెల్లగా సినిమాల షూటింగ్స్‌ పునః ప్రారంభం అయ్యాయి.

 After 8 Months Pawan Kalyan Joins Vakeel Saab Shooting  Pawan Kalyan, Vakeel Sha-TeluguStop.com

ఆగస్టు నుండి సినిమాల షూటింగ్‌ జరుగుతున్నాయి.కాని పవన్‌ కళ్యాణ్‌ మాత్రం ఇప్పటి వరకు షూటింగ్‌ లో జాయిన్‌ కాలేదు.

పైగా ఈయన వరుసగా సినిమాల మీద సినిమాలు కమిట్‌ అవుతున్నాడు.ప్రస్తుతం ఈయన ఆరు సినిమాలు చేయాల్సి ఉంది.

కాని షూటింగ్‌ కు మాత్రం హాజరు కావడం లేదు.బాలీవుడ్‌ లో హిట్‌ అయిన పింక్‌ సినిమాను వకీల్‌ సాబ్‌ గా రీమేక్‌ చేస్తున్నాడు.

సగానికి పైగా షూటింగ్‌ పూర్తి అయిన సినిమా మే లో విడుదల చేయాలనుకున్నారు.కాని షూటింగ్‌ ఆగిపోవడంతో సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తారని అంటున్నారు.

మొన్నటి వరకు పవన్‌ షూటింగ్‌ కు హాజరు కాకపోవడం వల్ల సంక్రాంతికి అయినా వస్తుందా లేదా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి.కాని నిన్నటి నుండి పవన్‌ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలో వేసిన కోర్టు సెట్‌లో పవన్‌ కళ్యాణ్‌ షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.మూడు వారాల పాటు ఈ షూటింగ్‌లో పవన్‌ పాల్గొంటాడు.ఇదే షెడ్యూల్‌ లో పవన్‌ మరియు శృతి హాసన్‌ల కాంబో సీన్స్ మరియు పాటను కూడా చిత్రీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది.మొత్తానికి వకీల్‌ సాబ్‌ చిత్రీకరణలో పవన్‌ జాయిన్‌ అవ్వడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే ఆయన షూటింగ్‌ అప్‌డేట్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా తెలియజేయడం కోసం ఒక పోస్టర్‌ ను లేదా మేకింగ్‌ వీడియోను విడుదల చేయబోతున్నారట.సంక్రాంతికి థియేటర్లు పూర్తి స్థాయిలో ప్రారంభం అయితే వకీల్‌ సాబ్‌ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube