24 సంవత్సరాల తరవాత లోక్ సభ లో అద్భుతం

భారత చరిత్రలో ప్రస్తుత లోక్ సభ సమావేశాలు ఎంతో కాలం గుర్తుండి పోతాయనడంలో సందేహం లేదు.ఎందుకంటే, దాదాపు 24 సంవత్సరాల తరువాత విపక్ష సభ్యులు ప్రభుత్వానికి సహకరించడం, ఆపై నినాదాలు, పోడియంలోకి సభ్యులు దూసుకెళ్లడం వంటి ఘటనలు ఒక్కటి కూడా జరగకపోవడం ఈ సభలోని స్పెషల్.రెండు పుష్కరాల తరువాత నిరసనల కారణంగా లోక్ సభ ఒక్కసారి కూడా వాయిదా పడలేదు.

 After 24 Years, No Adjournments In Lok Sabha-TeluguStop.com

16వ లోక్ సభ 8వ సెషన్ సమావేశాలు గత నెల 25న ప్రారంభంకాగా, 13 సిట్టింగ్స్ జరిగాయి.ఇందులో భాగంగా సభ్యులు 92 గంటలా 21 నిమిషాల పాటు సభలో చర్చలు జరిపారు.గతంలో 1990, 1992 సంవత్సరాల్లో లోక్ సభ ఎటువంటి వాయిదాలు లేకుండా సాఫీగా సాగిందని, తిరిగి ఇప్పుడు అదే పరిస్థితి కనిపించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు.

ఒక్క నిమిషం కూడా వృథా కాలేదని, ఇందుకు మొత్తం సభ్యులను అభినందించాల్సిందేనని తెలిపారు.కాగా, ఈ సమావేశాల్లో లోక్ సభలో 120 శాతం, రాజ్యసభలో 85 శాతం ఉత్పాదకత నమోదైనట్టు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.

మొత్తం 18 రోజుల సమావేశాల్లో సభ్యుల నిరసనల కారణంగా పది నిమిషాలో, పావు గంటో, ఆ రోజుకో సభ వాయిదా పడలేదంటే అది అద్భుతమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube