20 ఏళ్ల తర్వాత హుజురాబాద్ అభివ్రుద్ది దిశగా దూసుకుపోతుంది ..మంత్రి గంగుల కమలాకర్

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సొంత పార్టీ అని, తెలంగాణ సాధన కోసం ప్రజలు తయారుచేసుకున్న ఆయుదం కేసీఆర్ అని, ఒకనాడు ఢిల్లీలో మదరాసీలని మనల్ని పిలిస్తూ కనీస గుర్తింపు లేని పరిస్థితుల్లో మన ఆత్మగౌరవాన్ని, అభివ్రుద్దిని పెంచేలా సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు మంత్రి గంగుల కమలాకర్, హుజురాబాద్ టౌన్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు మద్దతుగా సోమవారం ఉదయం నేతలతో కలిసి ప్రచారం నిర్వహించారు.ఈ రోజు డిల్లీలో మనల్ని హైదరాబాదీలని, అత్యధ్బుతంగా అభివ్రుద్ది చెందుతున్న కేసీఆర్ పాలనని పొగుడుతున్నారన్నారు.

 After 20 Years, Huzurabad Is Heading Towards Development. Minister Ganguly Kamal-TeluguStop.com

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అధ్బుతంగా డెవలప్ అయినా హుజురాబాద్ అత్యంత వెనకబడి ఉన్నదన్నారు, గత 20 సంవత్సరాలుగా నిర్లక్ష్యంతో ఆగిపోయిన అభివ్రుద్ది ఇప్పుడిప్పుడే ప్రారంభమయిందన్నారు, దాన్ని కుంటుపడకుండా కొనసాగించడానికి గెల్లు శ్రీనివాస్ యాదవ్కి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు మంత్రి గంగుల.ఇన్నేండ్లుగా నియోజకవర్గం కోసం ఏనాడు నిధులు అడగని వ్యక్తి తన స్వంత లాభం కోసం మాత్రమే అడిగి పేదల భూముల్ని లాక్కున్నాడన్నారు.

ఇప్పుడు కూడా ప్రతిపక్షం గెలిస్తే ప్రతీ పనికి అడ్డుపడి అభివ్రద్దిని సాగనివ్వరన్నారు.

చెలుక వాగు బ్రిడ్జి, సత్సంగ్ రోడ్డు ఇంకా మిగతా అభివ్రుద్ది పనుల్ని ఆపుతాడన్నారుమల్లీ తన సొంత లాబాన్నే చూసుకుంటారన్నారు, నేను ప్రభుత్వంలో ఉన్నానా అని ఎదురుప్రశ్నిస్తాడన్నారు, ఈటెల ఎనాడు ప్రజలకు అందుభాటులో ఉండరన్నారు మంత్రి గంగుల, అందుకే గెల్లును గెలిపించుకోవాలన్నారు, ప్రతీక్షణం తనలాగే హుజురాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండి అండగా ఉండే నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు, పేదింటి బిడ్డ, ఉద్యమకారుడు నిరంతరం ప్రజల పక్షాన ఉండే గెల్లును గెలిపించి పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు మంత్రి గంగుల.

ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి అభివ్రుద్ది జరుగుతుందన్నారు, తద్వారా కంపెనీలు వచ్చి మన హుజురాబాదీలకు ఉద్యోగాలు దొరుకుతాయన్నారు.

Telugu Bjp, Etala Rajender, Gangula Kamal, Huzurabad, Kamalkar, Trs, Ts Poltics-

కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని మన పిల్లల భవిష్యత్ కోసం చావునోట్లో పెట్టి తెచ్చిన తెలంగాణని అదే రీతిలో అభివ్రుద్ది చేస్తున్నారన్నారు గంగుల.రాష్ట్రానికి ముందు, ఇప్పటి పరిస్థితుల్ని బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు, కేసీఆర్ గారికి ముందున్న ముఖ్యమంత్రుల హయాంలో రోజుల తరబడి కరెంటు కోతలు, సాగునీళ్లే కాదు తాగునీళ్లు లేక ఆడబిడ్డలు టాంకర్ల వెంబడి పరుగెత్తేవారని, ఆసరాగా ఫించన్లు లేవని, బీడుభూములుండేవని, ఆడబిడ్డ పెండ్లంటే తండ్లాటుండేదన్నారు, కానీ కేసీఆర్ గారు వాటన్నింటినీ రూపుమాపారని నేడు 24గంటల కరెంటు, ఆసరా ఫించన్లు, కాళేశ్వరం దగ్గర కాలడ్డం పెట్టి సాగునీరు, తాగునీరు, కళ్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్, డయాగ్నస్టిక్ సెంటర్లు, గొర్రెరల పంపిణీ, రైతుబందు, రైతుబీమా, చేనేతమిత్ర, దళితబందు ఇలా వందల సంఖ్యలో అన్ని విషయాల్లో దేశానికే రోల్ మాడల్గా నిలిచామన్నారు, చాలా రాష్ట్రాలను, దేశాన్ని పాలిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ఫాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ గారు అందిస్తున్న పథకాలు ఎందుకు లేవని ప్రశ్నించారు మంత్రి గంగుల.అన్నింటినీ ప్రైవేటు పరం చేస్తున్న బీజేపీ మన రైతుల మోటార్ల దగ్గర మీటర్లు పెట్టాలని చూస్తొందన్నారు, ఇప్పటికే పెట్రోల్, డీజీల్, గ్యాస్ సిలిండర్ల రేట్లు పెంచి సామాన్యుడు బతకులని భారంగా మార్చిందన్నారు.

ఒకవేళ బీజేపీకి ఓటేస్తే ఈ ధరలు పెంచడానికి మద్దతిచ్చినట్టేనని, ప్రజలు విజ్ణులని అన్నింటినీ గమనించి ఓటేస్తారన్నారు మంత్రి గంగుల, రాబోయే హుజురాబాద్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలవడం ఖాయమన్నారు, దానికి కేసీఆర్ గారి పనితీరుపై ప్రజల్లో వస్తున్న భారీ స్పందనే నిదర్శనమన్నారు మంత్రి గంగుల.ఈ కార్యక్రమంలో హుజురాబాద్లోని వివిద పార్టీలకు చెందిన నాయకులు, బీజేవైఎం కార్యకర్తలు మంత్రి గంగుల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు, వారి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు మంత్రి గంగుల .ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube