18 ఏళ్ల తరువాత మళ్లీ పుట్టిన డయానా!

వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇప్పుడు ఇదే విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.18 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియా కు చెందిన ఒక పిల్లాడు తానే ప్రిన్సెస్ డయానా అంటూ చెప్పడం ఆ చిన్నారి పేరెంట్స్ ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.నిజంగా కొన్ని కొన్ని సార్లు చనిపోయిన తిరిగి మరో జన్మ ఎత్తుతారు అని పెద్దలు అంటూ ఉంటారు.అయితే ఏదో ఫ్యామిలీ కి సంబందించిన వారి విషయం ఇలాంటివి జరగడం చూస్తూనే ఉంటాం.

ఉదాహరణకు తల్లి పోలికలతో పుట్టిన కూతురో,లేదా తండ్రి పోలికల తో పుట్టిన కొడుకో,లేదా తాత పోలిక,ఇలా చాలా మంది పెద్దవాళ్ళ పోలీకలతో ఉండే వాళ్లు కొందరు ఉంటారు.

18 ఏళ్ల తరువాత మళ్లీ పుట్టిన డయ�

కానీ కుటుంబానికి ఎలాంటి సంబంధంలేని ఒక చిన్నారి తానే ప్రిన్సెస్ డయానా అని చెప్పడం, అంతేకాకుండా చిన్ననాటి సంగతులను కూడా తల్లిదండ్రులకు తెలపడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తుంది.అప్పుడు ఆ చిన్నారి బిల్లీ క్యాంప్‌బెల్ వయసు రెండేళ్లు.ఓ పేపర్‌లో ప్రిన్సెస్ డయానా ఫొటో చూపించి… అది తనే అన్నాడు.

అయితే పిల్లాణ్ని ఒళ్లో కూర్చోపెట్టుకున్న తండ్రి డేవిడ్ క్యాంప్‌బెల్ మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.అయితే సరిగ్గా రెండేళ్ల తర్వాత మళ్లీ మరోసారి అలాంటి సందర్భమే వచ్చింది.

అయితే ఈ సారి టీవీలో డయానా కనిపించడం తో వెంటనే గుర్తుపట్టిన బిల్లీ అది తనే అన్నాడు.తాను ప్రిన్స్‌గా ఉన్నప్పటి ఫొటోలు అవి అని అమ్మానాన్నకు చెప్పాడు.

పేరెంట్స్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు.

18 ఏళ్ల తరువాత మళ్లీ పుట్టిన డయ�

అంతేకాకుండా చిన్నప్పటి సంగతులను కూడా ఆ పిల్లాడు చెప్పడం తో వారు ఈ విషయం నిజామా కాదా అన్న భ్రమలో ఉండిపోయారు.బిల్లీ తండ్రి ఆస్ట్రేలియా లోని ఓ టీవీ ఛానెల్‌లో ప్రజెంటర్ కావడం తో పిల్లాడు చెప్పిన చిన్నప్పటి సంగతులను పరిశీలించగా పిల్లాడు చెప్పినవన్నీ నిజమే అని తేలింది.అందాల ప్రిన్సెస్ డయానా 1997లో కార్ యాక్సిడెంట్‌లో చనిపోయిన సంగతి తెలిసిందే.

అయితే ఆమె చనిపోయిన 18 ఏళ్ల తర్వాత బిల్లీ పుట్టాడు.తన కొడుక్కి ఈ డయానా ఆలోచనలు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదంటున్నాడు డేవిడ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube