అమెరికాలో భారత సంతతి వ్యక్తి చరిత్ర: సిన్సినాటి నగరానికి తొలి మేయర్‌గా ఎన్నిక

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు అన్ని రంగాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.ముఖ్యంగా రాజకీయాల్లో మనవారు దూసుకెళ్తున్నారు.

 Aftab Pureval Becomes First Indian-tibetan Mayor Of Us' Cincinnati City , Aftab-TeluguStop.com

గవర్నర్లు, సెనెటర్లు, చట్టసభ సభ్యులు, కాంగ్రెస్ సభ్యులు, మేయర్లుగా పలువురు భారతీయులు వున్నారు.ఇప్పుడు ఏకంగా అమెరికాలోని రెండో అత్యున్నత పదవిలో స్వయంగా భారత సంతతికి చెందిన కమలా హారిస్ వుండటం మనందరికీ గర్వకారణం.

తాజాగా ఇండో టిబెటెన్ జాతీయుడు అఫ్తాబ్ పురేవాల్ కొత్త చరిత్ర సృష్టించాడు.ఒహియో రాష్ట్రంలోని సిన్సినాటి నగరానికి మేయర్‌గా ఎన్నికయ్యాడు.తద్వారా ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి వ్యక్తిగా అప్తాబ్ రికార్డు సృష్టించాడు.38 ఏళ్ల అఫ్తాబ్ ఒక శరణార్థ టిబెటన్ తల్లి, ఒక భారతీయ తండ్రికి జన్మించాడు.మేయర్ ఎన్నికలలో తన ప్రత్యర్ధి డేవిడ్ మాన్‌నను అఫ్తాబ్ ఓడించాడు.

ఈ సందర్భంగా పురేవాల్ మాట్లాడుతూ.

సిన్సినాటి మేయర్‌గా ఎన్నికైనందుకు గౌరవంగా వుందన్నారు.గతేడాది యూఎస్ ప్రతినిధుల సభకు పోటీ చేసి విఫలమైన ఆయన తాజాగా మేయర్‌గా గెలవడం విశేషం.

అంతేకాదు.సిన్సినాటి నగర చరిత్రలో తొలి టిబెటన్ అమెరికన్, తొలి ఆసియా- అమెరికన్ పసిఫిక్ ద్వీపాలకు (ఏఏపీఐ) చెందిన మేయర్.

డెమొక్రాట్ పార్టీకి చెందిన పురేవాల్ గతంలో హామిల్టన్ కౌంటీ కోర్టులో క్లర్క్‌గా పనిచేశారు.ఈ ఏడాది మార్చిలో ఏఏపీఐ విక్టరీ ఫండ్ తన మేయర్ అభ్యర్ధుల స్లేట్‌లో అఫ్తాబ్ పురేవాల్‌ను డెమొక్రాట్‌లు, రిపబ్లికన్‌లతో సమానంగా విజయాన్ని సాధించగల ప్రగతిశీల స్వరంగా వ్యాఖ్యానించింది.

Telugu Aapi Victory, Aftabpureval, Aftabpurewal, Aftab Pti, Clerkhamilton, Ohio-

తను ఒక శరణార్ధి కుమారుడినని.తన తల్లి టిబెట్‌లో జన్మించిందని… అనంతరం తన తాతలతో కలిసి స్వదేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చిందని ఆఫ్తాబ్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.తన తల్లి, తాతలతో కలిసి నేపాల్ ద్వారా హిమాలయాల గుండా భారత్‌లోకి ప్రవేశించారని.అక్కడ ఆమె శరణార్ధిగా పెరిగిందని ఆయన అన్నారు.తన తల్లి మైసూరు పాఠశాలలో చదువుకుందని అనంతరం ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ చదువుతండగా తన తండ్రిని కలుసుకుందని ఆఫ్తాబ్ చెప్పారు.తన తండ్రి నాన్న గారు (తాత) ఇండియన్ మిలటరీలో బ్రిగేడియర్‌గా పనిచేశారని ఆయన తెలిపారు.

వివాహం తర్వాత ఆఫ్తాబ్ పురేవాల్ తల్లిదండ్రులు అమెరికాకు వలస వచ్చి ఒహియోలో స్థిరపడ్డారు.అక్కడే 1982లో ఆప్తాబ్ జన్మించారు.

ఆయన చిన్నతనంలో ఒకసారి టిబెట్‌కు వెళ్లారు.అయితే ఢిల్లీకి మాత్రం ఎక్కువగా వచ్చేవాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube