కాబూల్ ఎయిర్ పోర్టు వ‌ద్ద హృద‌య విదార‌క ఘ‌ట‌న‌లు..

ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం ఆఫ్ఘ‌నిస్తాన్ చుట్టూ తాలిబ‌న్ల చుట్టూ చ‌ర్చ సాగిస్తోంది.ఇప్పేఉడు తాలిబ‌న్లు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను వ‌శం చేసుకోవ‌డంతో అఫ్గాన్ దేశ‌స్థులు ఎలాగైనా స‌రే దేశం విడిచి వెళ్లిపోవ‌డానికి డిసైడ్ అయిపోయారు.

 Heartbreaking Incidents At Kabul Airport, Kabul Airport, Afghanistan, Taliban,af-TeluguStop.com

ఇందుకోసం దేశ వ్యాప్తంగా వేలాది మంది కాబూల్ లోని ఎయిర్‌పోర్ట్‌కు క్యూ క‌డుతున్నారు.ఇక వేలాది మంది ఒకేసారి రావ‌డంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్ వ‌ద్ద గందరగోళంగా మారిపోయాయి పరిస్థితులు.

ఒక‌రిమీద ఒక‌రు ప‌డుతూ తొక్కిసలాట జ‌రుపుతున్నారు.ఇప్ప‌టికే ఈ తొక్కిస‌లాట‌లో అఫ్గాన్ పౌరులు ఏడుగురు చ‌నిపోయారు.
ఇక వేలాదిగా వ‌స్తున్న ప్రజలను చెదరగొట్టేందుకు తాలిబన్లు కూడా బాగానే ట్రై చేస్తున్నారు.వారంతా కూడా ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టేందుకు గాల్లోకి కాల్పులు చేయ‌డంతో ప్ర‌జ‌లు బెదిరిపోయి ఈ విధంగా తొక్కిసలాట చోటుచేసుకుంది.

ఇక ఇదే విధంగా ఎయిర్ పోర్టు మొత్తంలో ప‌రిస్థితులు దారుణంగా త‌యార‌య్యాయి.ఇక ఈ ప‌రిస్థితుల‌ను చ‌క్క దిద్దుతామ‌ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.అయితే తాలిబన్లు తాము ఎవ‌రికీ హాని చేయ‌మంటూ చెబుతున్నా కూడా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు చాలా దారుణంగా ఉంటున్నాయి.

Telugu Afghan Force, Afghanistan, Afghans, Kabul Airport, Taliban, Talibantakeov

దేశ వ్యాప్తంగా చాలాచోట్ల మహిళలు జాబులు చేయ‌కుండా తాలిబ‌న్లు అడ్డుకుంటున్నారు.ఇక దేశంలో ఇంత‌కుముందు యూఎస్ భద్రతా బలగాలకు సహకరించిన వారంద‌రి కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నారు తాలిబ‌న్లు.ఇక ప్ర‌పంచ దేశాలు ఆఫ్ఘ‌నిస్తాన్ లో ఇరుక్కుపోయిన త‌మ దేశ పౌరులను తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇక ఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌లు త‌మ పిల్ల‌ల‌ను కంచెల మీదుగా విసిరేయ‌డంతో వారిని అమెరికా బ‌ల‌గాలు అక్కున చేర్చుకుని స‌ప‌ర్య‌లు కూడా చేస్తున్నాయి.ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న‌లు ఇప్పుడు ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్నాయి.

కానీ తాలిబ‌న్లు మాత్రం త‌మ దారుణాల‌ను ఏ మాత్రం కూడా ఆప‌కుండా అలాగే కొన‌సాగిస్తూ అరాచ‌కాలు సృష్టిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube