శిథిలాల్లో యజమాని ఉన్నాడేమోనని పెంపుడు కుక్క వెతుకులాట

పెంపుడు కుక్కలతో కొంత మంది మనుషులకు అవినాభావ సంబంధం ఉంటుంది.వాటిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనంతగా బంధం పెనవేసుకుంటుంది.

 Afghanistan Earthquake Dog Comes To Departed Owner House Everyday Details, Pilla-TeluguStop.com

అవి కూడా తమ యజమానుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధం అవుతుంటాయి.అవసరమైతే ప్రాణాలను పణంగా పెట్టి పోరాడాని సంఘటనలూ మనం చూసి ఉంటాం.

తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫొటో నెటిజన్లను కదిలిస్తోంది.భూకంప శిథిలాలలో తన యజమాని ఎక్కడైనా ఉన్నాడేమోనని ఆశతో అన్వేషిస్తోంది.

దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.ఆఫ్ఘనిస్థాన్‌లో ఓ కుక్క గురించిన హృదయవిదారక సంఘటన ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.

కొన్ని రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ తూర్పు ప్రాంతంలో ఘోర భూకంపం సంభవించింది.భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది.భూకంపం ధాటికి ఎన్నో ఇళ్లు నేలమట్టం అయ్యాయి.1500లకు పైగా ప్రజలు చనిపోగా, వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

ఎటు చూసినా కన్నీరు పెట్టించే దృశ్యాలే అక్కడ కనిపిస్తున్నాయి.ఇప్పటికీ అక్కడ శిథిలాలను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది.

ఈ క్లిష్ట పరిస్థితిలో ఒక కుక్క క్రమం తప్పకుండా ఒక నిర్దిష్ట ప్రదేశానికి వస్తోందని, ఏదో కనుగొనడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రజలు గమనించారు.ఈ సంఘటన చాలా మందిని ద్రవింపజేసింది.భూకంపానికి యజమాని, కుటుంబ సభ్యులు మరణించారు.ఇరుగుపొరుగు వారు ఆ కుక్కకు ఆహారం, వసతి కల్పించి తమ సంరక్షణలో ఉంచారు.కానీ, కుక్క ప్రతిరోజూ ఆ ప్రాంతానికి చేరుకుంటుంది.అక్కడే ఏడుస్తూ, శిథిలాల నుంచి తన యజమానిని, కుటుంబాన్ని కనుక్కుందామనే ఆత్రుతతో వెతుకుతూ కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube