ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఆక‌లి కేక‌లు... అనారోగ్య‌పు చావులు

కాబుల్‌: ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన అనంతరం ఆ దేశంలోని లక్షలాది మంది ప్రజలు దేశం విడిచి, ఇతర దేశాల‌కే చేరుకుని, అక్క‌డ‌ ఆశ్రయం పొందుతున్నారు.అయితే ఇప్పుడు ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబన్ల‌ అరాచ‌కాల‌కు మించిన మ‌రో స‌మ‌స్య వేధిస్తోంది.

 Afghanistan Crisis Food Storage Will End This Month, Afghanisthan, Hungry, Kabul-TeluguStop.com

అదే ఆక‌లి.ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఐదేళ్ల క‌న్నా త‌క్కువ వ‌య‌సు గ‌ల పిల్లల్లో సగం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యారాజ్య స‌మితి ఒక‌ నివేదిక‌లో పేర్కొంది.

ఆ దేశ పౌరుల్లో మూడింట ఒక వంతు మందికి తగినంత ఆహారం అంద‌డం లేదని నివేదిక పేర్కొంది.ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆ దేశం మరింత పెద్ద సంక్షోభంలోకి వెళ్లకుండా ఉండాలంటే ఆ దేశానికి అవసరమైన సేవలను అందించాల‌ని ఐక్య‌రాజ్య స‌మితి సూచించింది.

ఆఫ్ఘ‌నిస్తాన్‌కు ఆరోగ్య, రక్షణ సేవలతో పాటు ఆహారం, ఇతర ఆహారేతర అవసరాలను తీర్చాలని కోరింది.

Telugu Aafghanistan, Afghanisthan, Hungry, Kabul, Kabul Airport, Talibans-Genera

ప్ర‌స్తుతం కాబూల్ విమానాశ్రయంలో 800 మంది పిల్లలతో సహా ప్రజలకు రక్షణ, ఆహార‌ సేవల‌ను వివిధ సంస్థ‌లు అందిస్తున్నాయి.అయితే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కింద అందిస్తున్న‌ ఆహార నిల్వలు సెప్టెంబర్ చివరి నాటికి అయిపోవ‌చ్చ‌ని ఐక్య‌రాజ్య స‌మితి తెలిపింది.అలాగే ఔష‌ధాల నిల్వ‌లు కూడా అడుగంటిపోతున్నాయి.

ప్రస్తుత పరిణామాలకు ముందే ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని సగం జ‌నాభా ప్రాథమిక అవసరాలకు కూడా నోచుకోని స్థితిలో ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube