పాకిస్తాన్ పై తాలిబాన్ల తూటా..? దాయాదికి ముచ్చమటలే..?

దేశం రెండు ముక్కలు అయిన దగ్గరి నుంచి రెండు దాయాదీ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వివాదం ముదిరింది.దానికి అమెరికా చైనా లాంటి దేశాలు ఆజ్యం పోస్తూ వచ్చాయి.

 Afghanistan And Iran To Support India,afghanistan, Iran,india,pakistan,taliban,u-TeluguStop.com

దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్కా.ఇప్పుడు ఒక లెక్కలా పాక్ పరిస్థితి ఉంది.

చీటికి మాటికి భారత్ పై అంతర్జాతీయ వేదికలపై విషయం చిమ్మే పాక్ ఇప్పుడు గోదుమ పిండి కోసం దేహీ అనే పరిస్థితి వచ్చింది.అయినా పాక్ ఆర్మీ మాత్రం ఇంకా భారత్ పై దాడి చేస్తూనే ఉంది.

అందుకే భారత్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టుంది.

పాకిస్తాన్ తో యుద్ధం వస్తే.

పది నిముషాల్లో ఆ దేశ ఆర్మీని మట్టు పెట్టగలరు.అయితే దానికి అనేక

అంతర్జాతీయ చట్టాలు

అడ్డు వస్తున్నాయి.

దాంతో శత్రవుకు శత్రువు మిత్రుడు అనే నినాదాన్ని భారత్ ఫాలో అవుతోంది.పాకిస్తాన్ తో బార్డర్ పంచుకుంటున్న దేశాలతో దోస్తీ చేస్తోంది.

అటు ఇరాన్ తో దోస్తీ చేస్తూ.చాబహార్ ఓడరేవును వాడుకుంటోంది.

ఇటు ఆఫ్ఘనిస్తాన్ లో సైతం భారీ పెట్టుబడులు పెట్టి వారిని మచ్చిక చేసుకుంది.పాకిస్తాన్ పై ముప్పేట దాడి చేసేందకు సైతం శతవిధాలా ప్రయత్నిస్తోంది.

Telugu Afghanistan, India, Indian, Iran, Pakistan, Taliban, Budget-Politics

ఇరాన్ కు పాకిస్తాన్ కు ఎప్పటి నుంచో గొడవలు నడుస్తున్నాయి.దాంతో ఆదేశ ఆర్మీ పాకిస్తాన్ సైనికులకు చుక్కులు చూపిస్తున్నారు.వారే అలా ఉంటే ఆఫ్ఘన్ సైనికులు మరీ క్రూరులు.పాక్ ఆర్మీ కనిపిస్తే.చాలు కారణం లేకుండానే మట్టు పెడుతున్నారు.ఇలాంటి టైంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు సాయం చేయడానికి ముందుకు వచ్చింది.

అస్రఫ్ ఘనీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే భారత్ చాలా సార్లు సాయం చేసింది.ఇక తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక.

దాదాపు ప్రపంచ దేశాలు అటు వైపు చూడటమే మానేశారు.అలాంటి టైంలో వారు భారత్ సాయం అడిగారు.

అప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న భారత్ అడిగిన వెంటనే ట్రక్కుల కొద్దీ, గోదుమ పిండీ, మెడిసిన్, ఆహార పదార్థాలను సాయంగా అందించింది.నిజానికి భారత్ పై తాలిబాన్లను ఉసిగొల్పాలని పాక్ భావించింది.

కానీ భారత్ దౌత్యానికి.పాకిస్తాన్ కు ముచ్చెమటలు పడుతున్నాయి.

Telugu Afghanistan, India, Indian, Iran, Pakistan, Taliban, Budget-Politics

పాకిస్తాన్ మనకు ఎక్కుపెడదామనుకున్న తాలిబాన్ల బుల్లెట్ ఇప్పుడు ఆ దేశాన్నే టార్గెట్ చేసింది.భారత్ ఇప్పుడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లోనూ ఆఫ్ఘన్ ప్రభుత్వానికి 200ల కోట్ల మానవతా సాయాన్ని ప్రకటించింది, దానికి స్పందించిన తాలిబాన్ ప్రభుత్వం భారత్ కు ధన్యవాదాలు తెలిపింది.ఇక భారత్ స్ట్రాటజీకి పాక్ తెగ కలవర పడుతోంది.ఇప్పటికైనా ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ విడనాడితే సాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని మన దేశ నేతలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube