ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో అన్ని దేశాలు వారి ప్రజలను, దౌత్య సిబ్బందిని స్వదేశాలకు రప్పించే ఏర్పాటు చేస్తున్నాయి.తొలుత కాబూల్ విమానాశ్రయాన్ని తాలిబన్లు మూసివేయడంతో నాటో బలగాలు దానిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
దీంతో తరలింపు ప్రక్రియ తిరిగి ఊపందుకుంది.ఇక అన్ని దేశాల కంటే వేగంగా స్పందించిన భారత్ ఇప్పటికే దౌత్య సిబ్బందిని, సాధారణ పౌరులను స్వదేశానికి తరలించింది.తాజాగా కాబుల్ విమానాశ్రయం నుంచి శనివారం కొంతమంది భారతీయులను వాయుసేన ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొస్తున్నారు అధికారులు.85 మందికి పైగా భారత పౌరులతో సి-130జె విమానం కాబుల్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరినట్లు విశ్వసనీయ సమాచారం.ఇక వాయుసేనకు చెందిన మరో సి-17 విమానం కూడా కాబుల్ ఎయిర్‌పోర్టులో ఉంది.ఆఫ్ఘనిస్తాన్‌లో మిగిలిపోయిన మరికొందరు భారతీయులను తీసుకుని ఆ విమానం కూడా త్వరలోనే స్వదేశానికి బయల్దేరే అవకాశం వుంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో భారత్‌కు చెందిన నాలుగు దౌత్య కార్యాలయాలు ఉన్నాయి.కాబూల్‌లో అదనంగా మరో ఎంబసీ ఉన్నది.
కాందహార్, హీరత్‌తో పాటు మజార్ యే షరీఫ్ పట్టణంలోనూ భారతీయ కాన్సులేట్ ఉంది.అయితే తాలిబన్ ఫైటర్లు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి కొన్ని రోజుల ముందే మజార్ యే షరీఫ్ కాన్సులేట్‌ను భారత్ మూసివేసింది.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మూడు రోజుల్లోనే ఆఫ్ఘనిస్తాన్ నుంచి సుమారు 200 మంది దౌత్య సిబ్బందిని తరలించినట్లు ఆఫ్గన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టండన్ తెలిపారు.

కాగా, మరికొందరు భారతీయులు ఇంకా ఆఫ్ఘాన్‌లోనే చిక్కుకుని ఉన్నారు.వారిని కూడా స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.దీనిలో భాగంగా ఆఫ్ఘనిస్థాన్‌లో చిక్కుకున్న భారత ప్రవాసులకు విదేశీ వ్యవహారాల శాఖ(ఎంఈఏ) తాజాగా కీలక సూచన చేసింది.
కాబూల్ నుంచి రాయబార కార్యాలయ సిబ్బంది మొత్తాన్నీ తరలించిన నేపథ్యంలో అక్కడి భారతీయులు .కేంద్ర ప్రభుత్వ సాయం పొందడానికి వీలుగా విదేశాంగ శాఖ ‘స్పెషల్ అఫ్ఘానిస్థాన్ సెల్’ను ఏర్పాటు చేసింది.ఈ సెల్‌కు వచ్చిన కాల్స్ ఆధారంగా ఆఫ్ఘనిస్తాన్‌లో సుమారు 450 మంది వరకు భారతీయులు ఉన్నట్టు అంచనా.