ఆఫ్ఘన్ తో చర్చలను రద్దు చేసుకున్న అమెరికా,హెచ్చరించిన తాలిబన్లు  

Afghan Taliban Warning To America-nri,taliban

ఆఫ్ఘన్ తో చర్చలు జరిపి ఉగ్రవాదాన్ని అరికట్టాలి అని అగ్రరాజ్యం అమెరికా గత కొంత కాలంగా చర్చలు జరుపుతున్న విషయం విదితమే.అయితే ఈ క్రమంలో ఈ నెల 23 న ఆఫ్ఘన్ తో జరగాల్సిన చర్చలను అమెరికా రద్దు చేసింది.దీనితో అమెరికా కే తాలిబన్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.అమెరికా తమతో జరపాల్సిన శాంతి చర్చలను రద్దు చేసుకుంటే దాని వలన అమెరికా భారీ గా నష్టపోవాల్సి వస్తుంది అని తాలిబన్ సంస్థ హెచ్చరించింది.

Afghan Taliban Warning To America-nri,taliban-Afghan Taliban Warning To America-Nri

ఇప్పటి వరకు ఇరు వర్గాల మధ్య చర్చలు శాంతియుతంగానే జరిగాయి.దీంతో ఈనెల 23 వ తేదీన మరోసారి చర్చలు జరపాలి అనుకున్నారు.కానీ, ట్రంప్ అనూహ్యంగా రద్దు నిర్ణయం తీసుకోవడం విశేషం.అమెరికా సైనికుడు తాలిబన్ ఉగ్రవాదుల కాల్పులలో ప్రాణాలు కోల్పోవడంతో దానికి నిరసనగా 23న జరగాల్సిన ఈ శాంతి చర్చలు ట్రంప్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది.అయితే మరోపక్క చర్చలు రద్దు కావడం తో తాలిబన్ సంస్థ కు హెచ్చరికలు జారీ చేసింది.

Afghan Taliban Warning To America-nri,taliban-Afghan Taliban Warning To America-Nri

ఈ విధంగా చర్చలు రద్దు చేసుకుంటే అమెరికా తీవ్రంగా నష్టపోతుంది అంటూ హెచ్చరించింది.అయితే తాలిబన్ల హెచ్చరికల పై ట్రంప్ ఎలా స్పందిస్తారో అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.