అమెరికన్ల‌కు పైస‌లు ఇచ్చి పెళ్లి చేసుకుంటున్న ఆఫ్ఘాన్ అమ్మాయిలు.. ఎందుకో తెలుసా..

ఆప్ఘనిస్తాన్ దేశంలో తాలిబన్ల పాలనలో ప్రజలు భయంతో వణికిపోతున్న సంగతి అందరికీ విదితమే.ముఖ్యంగా మహిళలు తమకు రక్షణ ఇక ఉండబోదని భయాందోళన చెందుతున్నారు.

 Afghan Girls Marrying Americans For Money Do You Know Why, Afghan Girls, America-TeluguStop.com

ఈ క్రమంలోనే తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.ఆప్ఘనిస్తాన్‌లోనే ఉంటే తమ ప్రాణాలు పోతాయని భయపడుతున్న మహిళలు అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు దారులు వెతుక్కుంటున్నారు.

ఇప్పటికే చాలా మంది దేశం విడిచిపారిపోయారు.ఇందులో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఉన్నారు.

కాగా, దేశంలో ఉండిపోయిన మహిళలు ఇతర దేశాలకు వెళ్లేందుకు డిఫరెంట్ ప్లాన్స్ వేస్తున్నారు.తాము విదేశీయుల భార్యలు అని సాక్ష్యం చూపించుకునేందుకు అమెరికన్లను అప్ఘన్ మహిళలు పెళ్లి చేసుకుంటున్నారు.

ఇదంతా కూడా కాబుల్ విమానాశ్రయం బయట జరుగుతోంది.క్రూరమైన తాలిబాన్ పాలన నుంచి తప్పించుకునేందుకు అమెరికన్లను తమ భర్తలని చెప్పుకుని ఆప్ఘన్ మహిళలు దేశం విడిచి వెళ్లిపోతున్నారు.

కాగా, ఇలా వెళ్లే క్రమంలో మహిళలు అమెరికన్లకు డబ్బులు చెల్లిస్తుండటం గమనార్హం.మొత్తంగా మాతృదేశాన్ని వదిలి వెళ్లిపోయేందుకుగాను మహిళలు ఇలా కొత్త దారి వెతుక్కున్నారు.

అయితే, ఈ విషయం తాలిబన్లకు ఎలా తెలిసిందో తెలియదు కానీ కాబుల్ నుంచి మహిళలతో పాటు పురుషుల ప్రయాణాన్ని నిషేధించారు తాలిబన్లు.

Telugu Afghan, Americans, Delhi, Kabul Airport, Talibans-Latest News - Telugu

అయితే, ఆప్ఘనిస్తాన్ నుంచి మహిళలను ఇతర దేశాలకు తరలించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఆ దేశం నుంచి చాలా మంది జనం పారిపోయారు.అమెరికా తన బలగాలను ఉప సంహరించుకుంది.

ఈ క్రమంలోనే అమెరికా ఇతర దేశాలకు చెందిన వారిని ఆప్ఘనిస్తాన్ నుంచి వేరే దేశాలకు పంపించారు.ఆప్ఘన్ దేశ తొలి మహిళా, ముస్లిమేతర ఎంపీ ఆ దేశం విడిచి ఇండియాకు వచ్చేసింది.

ప్రస్తుతం ఆమె భారతదేశ రాజధాని న్యూ ఢిల్లీలో తలదాచుకుంది.ఆప్ఘన్ ఇలాంటి పరిస్థితులు వస్తాయని అస్సలు ఊహించలేదని, మాతృదేశం నుంచి పిడికెడు భూమిని తెచ్చుకోలేకపోయానని ఎమోషనల్ కావడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube