అన్ని బాగున్నా కూడా కొందరు ఏదో పోయింది, ఏం సాధించలేక పోతున్నట్లుగా బాధపడుతూ ఉంటారు.ప్రతి జీవితంలో కూడా ఏదో నిరాశ ఉంటుంది.
ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక విషయంలో ఇతరులతో పోల్చితే వెనుక ఉంటారు.అయితే దాన్ని గుర్తు చేసుకుని, అదే పెద్ద సమస్యగా భావించి జీవితంలో ముందుకు వెళ్లకుండా ఉండకూడదు.
జీవితంలో ప్రతి చోట కూడా విజయాలు సాధించాలని ఏమీ లేదు.అయితే మనం అనుకున్నట్లుగా జీవితంను సాగించడం మాత్రం కష్టం కాదు.
అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఎంతో మంది అంగవైకల్యం లేని వారికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.కొందరు చిన్న పాటు వైకల్యంను కూడా పెద్దదిగా ఊహించుకుని తమకు తామే దేనికి పనికిరాం అని అనుకుంటూ ఉంటారు
అలాంటి వారికి అప్ఘనిస్థాన్‌కు చెందిన అహ్మద్ సయ్యద్ రహ్మాన్ ఆదర్శంగా చెప్పుకోవాలి.
ఎందుకంటే అప్ఘనిస్థాన్‌లో సాయుద బలగాలు కాల్పులు జరుపుతున్న సమయంలో అహ్మద్ ఎనిమిది నెలల పసి బాలుడు, ఆ సమయంలో అతడి కాలులోకి బుల్లెట్ దూసుకు పోతుంది.దాంతో అతడి కాళును తొలగించాల్సి వచ్చింది.
అతడి కుటుంబ సభ్యులు ఆ సమయంలో మృతి చెందడంతో అప్పటి నుండి కూడా అతడు ఒక హాస్పిటల్లో శరణార్ధిగా జీవితాన్ని గడుపుతున్నాడు.ఒక కాళు లేకున్నా అతడు అక్కడ ఉన్న వారందరిని కూడా నవ్విస్తూ, ఎప్పుడు కూడా హుషారుగా అందరితో కలగలుపుగా ఉంటాడు.
కృత్రిమ కాలు ఏర్పాటు చేయడంతో నార్మల్ వ్యక్తి మాదిరిగానే అహ్మద్ నడుస్తూ ఉంటాడు.
ఇక తనకు ఒక కాలు లేదు అనే కుంగుబాటుకు లోను కాకుండా ప్రతి రోజు కూడా తన రెగ్యులర్ కార్యక్రమాలు చేసుకుంటూ అందరిని ఆశ్చర్యపర్చుతాడు.ఇక తాజాగా ఇతడు డాన్స్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది.ఒక కాళు లేకున్నా అతడు చాలా కాన్ఫిడెన్స్‌తో, ఆనందంతో అందరి మొహంలో ఆనందంను చూడాలనే ఉద్దేశ్యంతో వేస్తున్న స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.
కాళు లేవని కృంగిపోకుండా అద్బుతమైన కాన్ఫిడెన్స్‌తో అహ్మద్ చేస్తున్న డాన్స్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.మూడు రోజుల్లోనే మిలియన్ వ్యూస్‌ను ఈ వీడియో దక్కించుకుంది.అంగవైకల్యం అనేది ఆనందంకు అడ్డు కాదని ఈ బాలుడు నిరూపించాడు.ప్రతి చిన్న విషయానికి క్రుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని ఈ బాలుడిని చూసి నేర్చుకోవాలి.