వైసీపీ పై అభిమానం..... ఈ రోజు ఉచితంగా టీ అందిస్తున్నాడు  

Affection On Ycp Party Makes Tea Supply Today-

మనిషికో పిచ్చి మదిలో సుమతి అన్న సామెత వినే ఉంటారు.ఎవరిపైనా అయినా అభిమానం చూపించాలి అంటే అందరూ ఒకేలా చూపించారు.ఒక్కొక్కరు ఒక్కోలా తమ అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు..

Affection On Ycp Party Makes Tea Supply Today--Affection On YCP Party Makes Free Tea Supply Today-

సరిగ్గా చిత్తూరు జిల్లా కు చెందిన ఒక వైసీపీ అభిమాని తన అభిమానాన్ని ఉచిత టీ అందిస్తూ చూపిస్తున్నాడు.ఈ రోజు నవ్యంధ్ర నూతన ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు కు చెందిన వైసీపీ అభిమాని షబ్బీర్ తన దుకాణంలో ఈ రోజు ఉచితంగా టీ అందించి జగన్ పై,ఆ పార్టీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

స్థానిక రంగాపురం పెట్రోల్ బంకు వద్ద ఉన్న షబ్బీర్ టీ దుకాణంలో నేడు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతమంది వచ్చినా టీ ఉచితంగా అందిస్తానని చెబుతున్నారు.దీంతో అధిక సంఖ్యలో షబ్బీర్ దుకాణానికి వచ్చి ఉచితంగా టీ సేవిస్తున్నారు కూడా.అంతేకాకుండా షబ్బీర్ అభిమానాన్ని చూసి స్థానికులు ఫిదా అవుతున్నారు.ఇవాళ లక్ష మంది వచ్చినా తాను ఉచితంగా టీ అందిస్తానని.

జగన్‌పై అభిమానంతోనే ఇలా చేస్తున్నాని చెబుతున్నాడు షబ్బీర్.నిజంగా టీ రూపంలో షబ్బీర్ వైసీపీ పార్టీ పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటున్నాడు..