ఎయిరోస్పేస్‌ దిగ్గజం జనరల్ అటామిక్స్ గ్లోబల్ సీఈవోగా భారతీయుడు

అమెరికాలో మరో దిగ్గజ కంపెనీకి సారథిగా భారతీయుడు నియమితుడయ్యాడు.మానవ రహిత యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఇతర రక్షణ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే పేరెన్నిక కన్న జనరల్ అటామిక్స్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా భారత సంతతికి చెందిన ఎయిరోస్పేస్, రక్షణ నిపుణుడు డాక్టర్ వివేక్ లాల్ నియమితులయ్యారు.

 Indian-american Aerospace Expert Vivek Lall Appointed General Atomics Ceo, Aeros-TeluguStop.com

అమెరికన్ సెక్యూరిటీ అండ్ ఎయిరో‌స్పేస్‌ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్‌లో ఏరోనాటిక్స్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న వివేక్ లాల్ ఏప్రి ల్‌లో తన పదవికి రాజీనామా చేశారు.కుటుంబంతో ఎక్కువసేపు గడపటానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివేక్ ప్రకటించారు.

కాగా ఆయన త్వరలోనే జనరల్ అటామిక్స్ గ్లోబల్ కార్పోరేషన్ (జీఏ) సీఈవోగా బాధ్యతలు స్వీకరిస్తారని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.డాక్టర్ లాల్ తన నైపుణ్యం, అనుభవంతో జపాన్, ఆస్ట్రేలియా, యూఏఈ తదితర దేశాలకు తన సేవలను విస్తరిస్తుందని ఆ సంస్థ తెలిపింది.

అమెరికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో లాల్‌కు ఉన్న అపారమైన అనుభవం జీఏను బలోపేతం చేస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.

జనరల్ అటామిక్స్ ప్రపంచంలో ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉన్న అణు, రక్షణ సంస్థలలో ప్రముఖమైనది.

మానవరహిత విమానాలు, ఎలక్ట్రో- ఆప్టికల్, రాడార్, సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ మరియు ఆటోమేటెడ్ ఎయిర్‌బోర్న్ నిఘా వ్యవస్థలను ఈ సంస్థ తయారు చేస్తుంది.ఇండోనేషియాలోని జకార్తాలో జన్మించిన వివేక్ లాల్.

జనరల్ అటామిక్స్‌లో అత్యున్నత పదవిలో పనిచేయడం ఇది రెండో సారి.ఇంతకు ముందు 2014-2018 వరకు ఈ కంపెనీలోని స్ట్రాటజిక్ డెవలప్‌మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు.

తన వ్యూహ చతురతతో నాటోయేతర దేశమైన భారత్‌కు కేటగిరీ-1 మానవరహిత వైమానిక విమానాలను (యూఏవీ) విక్రయించాలన్న ట్రంప్ నిర్ణయంలో వివేక్ లాల్ కీలకపాత్ర పోషించారు.క్షిపణులను మోసుకెళ్లగల సామర్ధ్యం ఉన్న యూఏవీలు కేటగిరీ-1 కిందకు వస్తాయి.

చీఫ్ ఎగ్జిక్యూటివ్ హోదాలో వివేక్ లాల్ జనరల్ అటామిక్స్‌కు నాయకత్వం వహించనున్నారు.

Telugu Aerospacevivek, Generalatomics, Indianamerican-

2000 చివరిలో బోయింగ్ డిఫెన్స్ స్పేస్ అండ్ సెక్యూరిటీకి వైస్ ప్రెసిడెంట్ మరియు ఇండియా కంట్రీ హెడ్‌గా వ్యవహరించిన వివేక్ లాల్ బిలియన్ డాలర్ల విలువ చేసే ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలలో ముఖ్య భూమిక పోషించారు.వీటిలో 4 బిలియన్ డాలర్ల విలువైన 10 సీ-17 స్ట్రాటజిక్ లిఫ్ట్ మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్, 3 బిలియన్ డాలర్ల విలువైన పీ-8ఐ యాంటీ సబ్‌మెరైన్ ఎయిర్‌క్రాఫ్ట్, 28 అపాచీ హెలికాఫ్టర్లు, 5 బిలియన్ డాలర్ల విలువైన 15 చినూక్‌లు, 200 బిలియన్ డాలర్ల విలువైన 22 హార్పూన్ క్షిపణులు ఉన్నాయి.రెండేళ్ల క్రితం యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్వైజరీ కమిటీలో వివేక్ లాల్ నియమితులయ్యారు.2005లో ప్రారంభమైన యూఎస్- ఇండియా ఏవియేషన్ కో ఆపరేషన్ ప్రోగ్రాం వ్యవస్థాపక కో చైర్‌గా కూడా లాల్ వ్యవహరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube