అమ్మ బాబోయ్‌.. విమానం నీళ్ల‌లో ప‌డుతుందా ఏంటి..?

భూమి మీద మనం ప్రయాణించేందుకు అనేక రకాల సాధనాలు అందుబాటులో ఉన్నాయి.కానీ చాలా మంది వేగంగా గమ్య స్థానాలను చేరుకునేందుకు విమానాలను ఉపయోగిస్తారు.

 Aeroplane Landing On Water Illusion Viral Video, Aeropalne, Aeroplane Landing Vi-TeluguStop.com

విమానాలు గాలిలో ఎగురుతుండగా చాలా మంది భయపడుతుంటారు.కొందరైతే ఏకంగా వాంతులే చేసుకుంటారు.

చాలా మందికి అసలు విమానం ప్రయాణించే విధానం గురించి సమగ్రంగా తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.అలాగే కొంత మందిలో అసలు విమానాలు నేల మీద కాకుండా నీటిలో కూడా ల్యాండ్ అవుతాయా అనే అనుమానాలు కలుగుతూ ఉంటాయి.

కానీ విమానాలు ఎయిర్ పోర్ట్ లలో ప్రత్యేకంగా ల్యాండింగ్ కోసం కట్టిన రన్ వేల మీద తప్ప మరెక్కడా ల్యాండ్ కావు.కానీ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియోలో విమానం నీళ్ల మీద ల్యాండ్ అవుతున్నట్లు ఉండడంతో చాలా మంది ఆసక్తిగా తిలకిస్తున్నారు.

అసలు విషయం తెలిస్తే షాకవుతారు.ఇంతకీ ఏం జరిగిందంటే…
ప్రపంచంలోని చాలా దేశాల్లో విమానాశ్రయాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి.

కొన్ని మైదాన ప్రాంతంలోనే ఉండగా… కొన్ని మాత్రం కొండ ప్రాంతాల్లో, సముద్ర తీరాల్లో ఉంటుంటాయి.ప్రస్తుతం వైరల్ గా మారిన వీడియోలో కూడా ఉన్న ఎయిర్ పోర్ట్ ఇలాంటిదే.

ఈ ఎయిర్ పోర్ట్ ను నదీ తీరంలో నిర్మించడం వలన ఈ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సిన అన్ని విమానాలు నది మీద నుంచి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.అలా ల్యాండింగ్ సమయంలో తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే దాదాపు 18 వేల పైచిలుకు నెటిజన్లు వింతగా ఉన్న ఈ వీడియోన చూడడం విశేషం.చూసిన ప్రతి నెటిజన్ ఆశ్చర్యానికి లోనవుతూ….

తమకు తోచిన రీతిలో విభిన్న కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube