ఎగిరే విమానంలో చెలరేగిన మంటలు... చివరకు?

మనలో చాలామందికి విమానంలో ప్రయాణం అనేది ఒక కల.జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణం చేయాలని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు.

 Terrifying Video Of Plane Crashing In America, Planes, Military Charted Flight,-TeluguStop.com

అయితే ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా అనిపించే విమాన ప్రయాణం కొన్ని సందర్భాల్లో భయభ్రాంతులకు కూడా గురి చేస్తూ ఉంటుంది.తాజాగా అమెరికాలోని హోనోలోలు ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన ఆ ఫ్లైట్ లో ప్రయాణించే ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసింది.

మిలటరీ ఛార్డర్ ఫ్లైట్ ఆకాశంలో ఎగిరే సమయంలో ఫ్లైట్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి.ఎగిరే విమానం రెక్కపై మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

విమానం ఎగిరే సమయంలో గాలి కూడా ఎక్కువగా వీయడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి.దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు తమ ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్టేనని భావించారు.

అయితే ప్రయాణికుల అదృష్టం బాగుందేమో కానీ ఒక్క ప్రయాణికునికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండానే విమానం సురక్షితంగా నేలపై ల్యాండ్ అయింది.దీంతో ఊపిరి పీల్చుకుంటూ ప్రయాణికులు నెమ్మదిగా నేలపై దిగారు.

విమానానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతుండగా ఆ వీడియోలు, ఫోటోలు చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది.విమానంపై మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు తమ అనుభవాలను మీడియాతో పంచుకుంటూ తాము తీవ్ర భయాందోళనకు గురయ్యామని గతంలో ఎన్నోసార్లు విమాన ప్రయాణం చేసినా ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురు కాలేదని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube