'మేజర్‌' కి అక్కడున్నంత క్రేజ్ ఇక్కడ లేదేం?

అడవి శేషు హీరోగా రూపొందిన మేజర్ సినిమా అతి త్వరలోనే ఇండియన్ బాక్సాఫీన్ ను తాకబోతుంది.మేజర్ సినిమా గురించి గత రెండు వారాలుగా జోరుగా ప్రచారం జరుగుతోంది.

 Adivi Sesh Major Movie Pre Release Buzz,adivi Sesh,major Movie,major Screening,mahesh Babu,telugu Audiance, Military Officer-TeluguStop.com

కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా హిందీలో కూడా ఈ సినిమా రూపొందింది.ఈ సినిమా ను పాన్ ఇండియా మూవీ అనకుండా ఒక ఇండియన్ మూవీ అన్నట్లుగా యూనిట్‌ సభ్యులు ప్రచారం చేస్తున్నారు.

ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగి పోయాయి.ఈ వారంలోనే విడుదల కాబోతున్న మేజర్‌ సినిమా హడావుడి మామూలుగా లేదు.

 Adivi Sesh Major Movie Pre Release Buzz,Adivi Sesh,Major Movie,Major Screening,Mahesh Babu,Telugu Audiance, Military Officer-మేజర్‌#8217; కి అక్కడున్నంత క్రేజ్ ఇక్కడ లేదేం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విడుదల వారం పది రోజులు ఉండగానే థియేటర్లలో ప్రీమియర్ షో లు వేస్తున్నారు.గతంలో ఏ ఒక్క సినిమా కు ఇలా ప్రీ మియర్ లు పడలేదు.

ప్రీమియర్ లకు వస్తున్న రెస్పాన్స్ అంతా ఇంతా కాదు.మిలటరీ వాళ్ల కుటుంబాల కోసం మేజర్ సినిమా ను స్క్రీనింగ్ చేయడం జరిగింది.

ఆ సందర్బంగా ఎంతో మంది కన్నీళ్లు పెట్టుకోవడం కూడా మనం చూడవచ్చు.

ఇది అంతా కూడా నాణెం కు ఒక వైపు మాత్రమే.తెలుగు కాస్టింగ్‌.తెలుగు నిర్మాత మహేష్ బాబు అయినా కూడా తెలుగు నాట ఈ సినిమాకు అంత స్థాయి లో ఆధరణ లేదు అని చెప్పక తప్పదు.

ఎందుకు ఈ స్థాయి లో తక్కువ క్రేజ్ ఉంది అంటూ ఇది ఒక రియల్‌ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా.పైగా ఇది ఒక ఆర్మీ అధికారి నేపథ్యంలో సాగే కథ అని అంతా అనుకుంటున్నారు.

కాని కమర్షియల్‌ గా కూడా ఈ సినిమాలో ఎలిమెంట్స్ ఉంటాయి.హీరోయిన్‌ ఉంటుంది… కమర్షియల్‌ సన్నివేశాలు ఉంటాయి.

ఆ విషయాన్ని ప్రచారం చేయక పోవడం వల్ల తెలుగు ప్రేక్షకుల్లో మేజర్‌ గురించి అంతటి క్యూరియాసిటీ కనిపించడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.విడుదలకు మరో మూడు నాలుగు రోజులు ఉంది కనుక ఈ లోపు అయినా తెలుగు ప్రేక్షకుల్లో బజ్‌ క్రియేట్‌ అయ్యేలా చేస్తారా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube