ఆ భయంకరమైన బావి రహస్యం కనుగొన్న సాహసికులు..!

భూమి పుట్టినప్పట్నుంచి ఇప్పటివరకు ఎన్నో జీవరాసులు, కట్టడాలు, కొండలు, రాళ్లు ప్రకృతి వైపరీత్యాలకు భూమి అంతర్భాగంలో కలిసిపోయాయి.కానీ అప్పుడప్పుడు తవ్వకాల్లో కొన్ని శిథిలాలు బయటపడడం చూస్తూ ఉంటాము.

 Adventurists Found The Secrets Of Yemen Well Of Hell-TeluguStop.com

దేవుని విగ్రహాలు, దేవాలయాలు, కట్టడాలు బయట పడుతూనే ఉన్నాయి.అలాగే కొన్ని మిస్టరీ గానే ఉండిపోతాయి.

అలాంటి వాటిలో మిస్టరీగా మారిన ఒక భయంకరమైన లోయ లాంటి బావి గురించిన రహస్యం ఇప్పటికి బయట పెట్టారు కొంతమంది సాహసికులు.ఇంతకీ లోయ లాంటి బావి ఏంటి.? అది ఎక్కడ ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం.

 Adventurists Found The Secrets Of Yemen Well Of Hell-ఆ భయంకరమైన బావి రహస్యం కనుగొన్న సాహసికులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యెమెన్ దేశంలోని యెమెన్ ఆల్ మహారాలోని బార్ హట్ బావి గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం.

అయితే ఈ బావి అలాంటి ఇలాంటి బావి కాదని, కొన్ని లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న భయంకరమైన బావి అని అక్కడ చుట్టు పక్కల ఉన్న కథలు కథలుగా చెప్తారు.అయితే ఈ బావి 112 మీటర్ల లోతున్నా చూడడానికి చిన్న గుంతలా కనిపిస్తుందని, దగ్గరకు వెళ్లి చూస్తే చీకట్లో నరక కూపంలా భయంకరంగా కనిపిస్తుందని, ఆ బావి లోపల మనుషులను చంపి శవాలను గుట్టలు గుట్టలుగా వేసున్నారని, అస్థిపంజారాలతో నిండి ఉంటుందని ప్రచారం.

అయితే ఈ బావి భయంకరమైనది కాదని, అదొక ప్రకృతి అందంగా తేల్చేశారు కొందమంది సాహసికులు.

Telugu 50-60 Feets Well, 8 Adventurists, Found Secrets, Secrets, Social Media, Viral Latest, Viral News, Well, Yemen Hell, Yemen Well Of Hell-Latest News - Telugu

తాజాగా ఓ ఎనిమిది మంది సాహసికులు కలిసి మిస్టరీగా మారిన ఈ బావి రహస్యం గురించి బయటపెట్టారు.వీరి బృందం లోపలికి వెళ్ళి చూడగా అక్కడ ఎలాంటి శవాల గుట్టలు, అస్థి పంజరాలు గాని లేవని, ఎలాంటి కంపు, వాసన కూడా రాలేదని తెలిపారు.ఇంకా ఆ లోయలాంటి బావిలో అడుగున ఒక జలపాతం, రంగు రాళ్లు, మేలిమి ముత్యాలు కూడా వారికి దొరికాయి.

వాటితో పాటు కొన్ని పాములు కూడా కనిపించాయి అంట.అక్కడ దొరికిన వాటి మీద రీసెర్చ్ చేసి ఆ బావి వయస్సును కనుగొనే పనిలో ఉన్నారు.

#Secrets #Feets #Secrets #Yemen #Yemen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు