కిడ్స్‌ ఛానెల్‌లో గంట పాటు అడల్డ్‌ కంటెంట్‌ ప్రసారం.. ఆ తర్వాత ఛానెల్‌కు ఎంత నష్టమో తెలిస్తే గుండె జారడం ఖాయం

పెరిగిన టెక్నాలజీ మరియు పరిజ్ఞానం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఛానెల్స్‌ పుట్టుకు వచ్చాయి.పెద్దలకు ప్రత్యేకంగా, మహిళలకు ప్రత్యేకంగా, యాక్షన్‌ సీన్స్‌ ఇష్టపడే వారికి ప్రత్యేకంగా, పిల్లలకు ప్రత్యేకంగా అంటూ రకరకాల ఛానెల్స్‌ వచ్చాయి.

 Adult Content Telecast In Kids Channel-TeluguStop.com

కేవలం పిల్లలకే ప్రత్యేకంగా అంటూ వేల సంఖ్యలో ఛానెల్స్‌ ఉన్నాయి.కిడ్స్‌ ఛానెల్స్‌ పిల్లల ప్రవర్తన మరియు వారి పెరుగుదలపై చాలా ప్రభావం చూపుతున్నాయని తాజాగా ఒక అధ్యయంలో వెళ్లడయ్యింది.

పిల్లల ప్రవర్తన చాలా విధాలుగా ప్రభావితం అవుతుంది.అలా కిడ్స్‌ ఛానెల్స్‌ వల్ల పిల్లల ప్రవర్తన మారుతుందని, వారు మంచి వారు కావాలన్నా, చెడ్డ వారు కావాలన్నా కూడా టీవీనే అంటూ తాజాగా సర్వేలో వెళ్లడయ్యింది.

అలాంటిది తాజాగా ఇరాక్‌లోని ఒక కిడ్స్‌ ఛానెల్‌లో అడల్ట్‌ కంటెంట్‌ ప్రసారం అవ్వడం చర్చనీయాంశం అయ్యింది.స్థానికంగా బాగా ఫేమస్‌ అయిన ఆ కిడ్స్‌ ఛానెల్‌కు వ్యూవర్‌ షిప్‌ బాగా ఉంటుంది.

అందులో వచ్చే కార్యక్రమాలు, షోలతో పిల్లలు బాగా కనెక్ట్‌ అవుతారు.అక్కడ ఉన్న కిడ్స్‌ ఛానెల్స్‌ అన్నింటిలోకి ఈ ఛానెల్‌ ప్రముఖంగా చెబుతూ ఉంటారు.

అలాంటి ఛానెల్‌లో అడల్ట్‌ కంటెంట్‌ రావడం చర్చనీయాంశం అయ్యింది.ఒక ఛానెల్‌లో ప్రసారం అవ్వాల్సిన కంటెంట్‌ కిడ్స్‌ ఛానెల్‌లో ప్రసారం చేసినట్లుగా తెలుస్తోంది.

పిల్లలు ఎక్కువగా కిడ్స్‌ ఛానెల్‌ చూసే ప్రైమ్‌ టైంలో ఈ అడల్డ్‌ కంటెంట్‌ రావడం మరింతగా విమర్శలపాలైంది.

కిడ్స్‌ ఛానెల్‌లో గంట పాటు అడ

ఈ విషయమై పిల్లల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఛానెల్‌పై ఫిర్యాదు చేయడం జరిగింది.దాంతో ఛానెల్‌పై కేసు నమోదు అయ్యింది.వేల సంఖ్యలో ఆ ఛానెల్‌పై కేసులు నమోదు అయిన నేపథ్యంలో అప్పటి వరకు సక్సెస్‌ ఫుల్‌గా సాగిన ఛానెల్‌ కాస్త ఒక్కసారిగా పడిపోయింది.టాప్‌ రేటింగ్‌ నుండి జీరోకు పడిపోయింది.100 మిలియన్‌ల వ్యాపారం చేసే సత్తా ఉన్న ఆ ఛానెల్‌ ఒక్కసారిగా పడిపోయింది.ఆ ఛానెల్‌ విలువ ఒక్కసారిగా 90 శాతం పడిపోయింది.ప్రస్తుతం ఆ ఛానెల్‌ లో అసలు ప్రసారాలే నిలిపేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube