ఆ అమెరికా మహిళకి ఊహించని బహుమతి..ఉబ్బితబ్బిబ్బై...!!!

అమెరికాలో ఓ రెస్టారెంట్ లో పని చేసే మహిళకి ఊహించని బహుమతి అందింది.ఎంతో కష్టపడి రోజుకి సుమారు 22 కిలోమీటర్లు నడుచుకుంటూ హోటల్ లో పని చేయడానికి వస్తున్న ఓ మహిళకి ఓ జంట కారుని గిఫ్ట్ గా ఇచ్చింది.

 Adrian Edward Suddengift-TeluguStop.com

దాంతో షాక్ కి లోనయిన ఆమె పట్టలేని సంతోషంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలిపింది.వివరాలలోకి వెళ్తే.

టెక్సాస్ లోని గెల్వేస్టర్ లో ని ఒక హోటల్ లో మహిళా వెయిటర్ పనిచేస్తోంది.ఆమె పేరు ఎడ్రియాన్ ఎడ్వర్డ్.

Telugu Adrian Edward, Telugu Nri Ups, Adrianedward-

ఆమె అమెరికన్ రెస్టారెంట్ చైన్ డెనీస్ లో ఆమె విధులు నిర్వరిస్తోంది.ఈమె ఆమె ఉంటున్న ప్రాంతం నుంచీ ఈ హోటల్ లో పనిచేయడానికి 22 కిలోమీటర్లు కాలినడక వస్తూ ఉంటుంది.అయితే

అదే హోటల్ కి తరుచు వచ్చే ఓ జంట ఈ విషయం తెలుసుకుని ఆమె ఇబ్బందులు పడకుండా ఉండటానికి ఓ కారుని బహుమతిగా ఇచ్చారు.అంతేకాదు ఆ కారుతో పాటు కొంత డబ్బునికూడా ఆమె ఖాతాలో జమచేసి ఖర్చులకి ఉంచమని ఇక నుంచీ కారులో రెస్టారెంట్ కి వెళ్ళమని చెప్పారు.

ఈ ఊహించని ఘటనతో ఆమె షాక్ అయ్యి వారికి కృతజ్ఞతలు తెలిపింది.ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు ఆ బహుమతి ఇచ్చిన జంటని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube