కుక్క చేసిన చిలిపి పనితో దాని యజమానికి పోర్న్‌ సంస్థ నుండి రూ. 5.6 వేల బిల్లు వచ్చింది

కుక్కలు మూగ జీవాలు, వాటికి తెలియకుండానే అవి కొన్ని తప్పులు చేస్తుంటాయి.ఆ తప్పుల కారణంగా ఓనర్స్‌ పెద్ద తలనొప్పులను ఎదుర్కొంటూ ఉంటారు.

 Adog Orderadult Channel And Aowner Get Large Bill Thomas-TeluguStop.com

కొన్ని కుక్కలు పక్కింటి వారిని ఇబ్బంది పెట్టి ఓనర్‌కు చిరాకు కలిగిస్తాయి.ఇక కొన్ని కుక్కలు రోడ్డు మీద కుక్కలు కనిపిస్తే వాటి వెంట పరిగెత్తడం లేదా భయపడం చేస్తాయి.

ఆ సమయంలో కూడా ఓనర్స్‌కు ఇరిటేట్‌ కలుగుతుంది.అలాంటి కుక్కలు మనం తరుచు చూస్తూ ఉంటాం.

కాని అమెరికాలోని ఒక కుక్క మాత్రం తన ఓనర్‌కు ఏకంగా 5600 రూపాయలు బొక్క పెట్టింది.అది చేసిన పనితో అతడు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

Telugu Dog, Dog Channel, America Calinia, Thomas Barnen-

పూర్తి వివరాల్లోకి వెళ్తే అమెరికాకు చెందిన థామస్‌ బర్నేస్‌ అనే వ్యక్తి ఒక కుక్కను పెంచుకుంటున్నాడు.ఆ కుక్క అంటే కుటుంబ సభ్యులందరికి కూడా చాలా ఇష్టం.అంత ఇష్టమైన కుక్కను ఎంతో ప్రేమగా చూసుకునేవారు.కుక్క అల్లరి చేయకుండా చాలా డీసెంట్‌గా ఉంటూ కుటుంబ సభ్యులను పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది.అందుకే ఆ కుక్కంటే థామస్‌కు చాలా ఇష్టం.ఇంట్లో మనిషి మాదిరిగా ఆ కుక్క మారిపోయింది.

టీవీని రిమోట్‌తో కంట్రోల్‌ చేయడం వంటివి కూడా దానికి ట్రైనింగ్‌ ఇచ్చారు.థామస్‌ మాటలతో పాటు అందరి మాటలు ఆ కుక్క అర్ధం చేసుకోవడంతో పాటు వారి ఆదేశాలనుసారంగా ప్రవర్తిస్తుంది.

ఒక రోజు కుక్క ఒక్కటే సోఫాలో ఉంది.టీవీ ఆన్‌ చేసి ఉంది.

కుక్క రీమోట్‌తో ఆడుతోంది.అటు ఇటు అంటూ ఏదో ఒకటి మార్చేస్తుంది.

అలా ఒక ప్రముఖ పోర్న్‌ పోగ్రాంను ఒక నెలకు గాను యాక్టివేట్‌ చేసింది.ఆ కుక్కకు ఏం చేస్తుందో తెలియదు.

టీవీలో ఏం వస్తుందో తెలియదు.కాని ఆడుతూ రిమోట్‌ను ప్రెస్‌ చేసింది.

అలా ఆ కుక్క సదరు పోగ్రామ్‌ను యాక్టివేట్‌ చేసిన కారణంగా యజమానికి ఆ నెల కేబుల్‌ బిల్లు ఏకంగా 85 డాలర్లు వచ్చింది.నార్మల్‌గా అయితే 20 నుండి 25 డాలర్ల వరకు మాత్రమే కేబుల్‌ బిల్లు ఉంటుంది.

కాని కుక్క చేసిన పనికి ఏకంగా 85 డాలర్ల వరకు చెల్లించాల్సి వచ్చిందని థామస్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

సదరు పోగ్రాం యాక్టివేట్‌ అయిన విషయం తమకు తెలియకుండానే డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని కూడా అన్నాడు.

ముందే తెలిస్తే సరే యాక్టివేట్‌ అయినందుకు చూసేవాడివా అంటూ కొందరు కామెడీ చేయడం మొదలు పెట్టారు.మీరు లేని సమయంలో ఆ కుక్క ఏమైనా చూసి ఉంటుందని మీరు అనుకుంటున్నారా అంటూ మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి ఆ కుక్క చేసిన పనితో థామస్‌ ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యాడు.ఇకపై కుక్కతో జాగ్రత్తగా ఉంటు దానికి రిమోట్‌ను సాధ్యం అయినంత దూరంగా ఉంచాలని భావిస్తున్నట్లుగా థామస్‌ చెప్పాడు.

ఈ విషయం పట్ల కుటుంబ సభ్యులు కూడా కుక్కపై కోపంగా ఉన్నారని, కాని తాను మాత్రం నా కుక్కపై కోపంగా లేనంటూ సోషల్‌ మీడియాలో చెప్పాడు.దానికి తెలియకుండా జరిగి పోయింది.

ఒక వేళ అలా చేస్తే నష్టం జరుగుతుందని దానికి అర్థం అయితే ఖచ్చితంగా ఆ పని చేసేది కాదని అన్నాడు.తన కుక్క చాలా మంచిదంటూ మరోసారి చెప్పడంతో అంతా కూడా ఆయన్ను అభినందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube