పాకిస్తాన్ మీద విమర్శలు చేసిన అద్నాన్ సమీ

ప్రస్తుతం భారత్ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశంలో ముస్లింలు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.షోకాల్డ్ సెక్యులర్ వాదులు అందరూ ఇండియాలో ముస్లింలు స్వేచ్చగా బ్రతికే హక్కు బీజేపీ సర్కార్ లేకుండా చేస్తుందని విమర్శలు చేస్తున్నాయి.

 Adnan Sami Tweet Carona-TeluguStop.com

ఇండియాలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి అని గగ్గోలు పెడుతున్నాయి.హిందుత్వ వాదంతో ఇతర మతాల వారి మీద దాడులు పెరిగిపోయాయని గోల చేస్తున్నారు.

అయితే కొంత మంది ముస్లింలు మాత్రం బీజేపీ సర్కార్ కి మద్దతుగా నిలుస్తున్నారు.

ఇదిలా ఉంటే కరోనా వైరస్ నుంచి రక్షించే క్రమంలో చైనాలోని ఉన్న భారతీయులని రక్షించడానికి ప్రత్యేకంగా రెండు విమానాలని భారత్ ప్రభుత్వం పంపించింది.

అయితే పాకిస్థాన్ ప్రభుత్వం మాత్రం తమ దేశ పౌరుల విషయంలో ఇందుకు భిన్నంగా స్పందించింది.కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో తమ వాళ్లు చైనాలోనే ఉంటేనే మేలని, తమకంటే చైనా వాళ్లే బాగా మిమ్మల్ని భాగా చూసుకుంటారని పాక్ ప్రభుత్వం పెద్దలు పాకిస్తాన్ పౌరులకి సలహా ఇచ్చింది.

దీనిపై పాకిస్తాన్ విద్యార్ధి తమ దేశంపై విమర్శలు చేశారు.భారత్ ని చూసి పాక్ బుద్ధి తెచ్చుకోవాలని అన్నాడు.ఇదిలా ఉంటే ఈ ట్వీట్ పై పాకిస్తాన్ నుంచి వచ్చి ఇండియాలో సెటిల్ అయిన గాయకుడు అద్నాన్ సమీ కూడా స్పందించారు.జీవితాంతం ముస్లింలు భారత్ కు విధేయులై ఉండాలని పేర్కొన్నారు.

ముస్లింలను పాకిస్థాన్ గవర్నమెంట్ ఓ పనికిరాని చెత్త కింద విసిరేసింది, అంతకంటే గొప్ప మర్యాద పాకిస్థానీ ముస్లింలకు ఎలా లభిస్తుంది అని పోస్ట్ చేశారు.పాకిస్తాన్ గా చెప్పుకోవడానికి సిగ్గు పడాలని కూడా వ్యాఖ్యానించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube