Adivi Sesh HIT 2 : 'హిట్ 2' సెన్సార్ పూర్తి.. ఈసారి కూడా వారు చూడడానికి అనుమతి లేదు!

న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.ఈయన సినిమాల్లో నటిస్తూనే మరో పక్క నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు.

 Adivi Sesh’s Hit 2 Censor Report,adivi Sesh, hit 2, Nani,vishwak Sen, Hit 2 C-TeluguStop.com

ఈయన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన సినిమాల్లో హిట్ 1 ఒకటి.విశ్వక్ సేన్ హీరోగా 2020 లో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబట్టి సూపర్ హిట్ అనిపించు కుంది.

ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించాడు.ఈ సినిమాతో హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ఇప్పుడు హిట్ 2 తెరకెక్కించాడు.అయితే ఈసారి హీరోగా విలక్షణ హీరో అడవిశేష్ నటిస్తున్నాడు.క్షణం, గూఢచారి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత అడవి శేష్ అంటే అందరికి తెలిసింది.

ఈయన సినిమా అంటే ఏదొక స్పెషల్ కంటెంట్ ఉంటుంది అని నమ్ముతున్నారు.

ఇటీవలే మేజర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.

ఈ సినిమా అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ అందుకుని మంచి సక్సెస్ దక్కడంతో ఈయన క్రేజ్ మరింత పెరిగింది.ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన హిట్ 2 ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అయ్యింది.

ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ తో మరిన్ని అంచనాలు పెంచుకుంది.డిసెంబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా ఒక్కో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.గతంలోనే ఈ సినిమాను చిన్న పిల్లలు చూడడానికి వీలు లేదని తెలిపారు.ఇక ఇప్పుడు సెన్సార్ వారు ఈ సినిమాకు కంప్లీట్ ‘ఏ’ సర్టిఫికెట్ అందించారు.దీంతో 18 ఏళ్ల లోపు చూడడానికి వీలు లేదని చెప్పాలి.దీంతో ఈ సినిమాలో వైలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం అవుతుంది.మరి హిట్ 2 నానికి, అడవి శేష్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube