Adivi Sesh HIt 2 : అభిమాని అడిగిన ప్రశ్నకు షాకింగ్ రిప్లై ఇచ్చిన అడివి శేష్.. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ ట్రోల్స్?

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.శేష్ కి తెలుగులో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.

 Adivi Sesh Superb Reply For Fans Question About His Favorite, Adivi Sesh, Shocki-TeluguStop.com

అడవి శేష్ కేవలం హీరో మాత్రమే కాదు.యాక్టర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్ కూడా.

తన సినిమా తానే రాసుకుని తానే డైరెక్ట్‌ చేసుకుని హిట్టు కొట్టి చూపించాడు.ఇదే విధంగా రెండు మూడు సార్లు రిపీట్ అయిన విషయం తెలిసిందే.2010లో విడుదల అయిన కర్మ సినిమా నుంచి తాజాగా విడుదలైన హిట్ 2 సినిమా వరకు అడవి శేష్ ప్రయాణం ఎంతో అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు.అడవి శేష్ నటించే సినిమాలు కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతోపాటు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.

విభిన్న పాతల్లో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు అడవి శేష్.ఎక్కువగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.అంతేకాకుండా ఎటువంటి పాత్రలో నటించిన కూడా ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేయగల నటుడు అడవి శేష్.ఇది ఇలా ఉంటే తాజాగా అడవి శేష్ నటించిన హిట్ 2 సినిమా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా మంచి సక్సెస్ అయిన సందర్భంగా చిత్రం బృందం ప్రస్తుతం సక్సెస్ మీట్ లో భాగంగా ఎంజాయ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలోని తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించారు హీరో అడవి శేష్.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ మీకు తెలుగులో ఏ హీరో అంటే ఇష్టం అని అడగగా.

ఆ విషయం పై స్పందించిన అడవి శేష్ నేనే అంటూ సమాధానం ఇచ్చాడు.అయితే అడవి శేష్ చెప్పిన సమాధానం పై ప్రస్తుతం సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కొందరు నెటిజన్స్ కాస్త ఎక్కువగా ఉంది అంటూ కామెంట్ చేయగా, ఇంకొందరు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ అతని పై ట్రోల్స్ చేస్తున్నారు.

అయితే అడవి శేష్ ఇచ్చిన సమాధానం కరెక్టే అని కొందరు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.ఎందుకంటే ఒకరిని చూసి నువ్వు ఇన్‌స్పైర్‌ అయితే నిన్ను చూసి ఎవరు ఇన్‌స్పైర్‌ అవుతారు? ఒక యాక్టర్‌గా, ఒక రైటర్‌గా, ఒక డైరెక్టర్‌గా ఇప్పటికే అడివి శేష్‌ తనని తాను నిరూపించుకున్నాడు.కాబట్టి అతని ఫేవరెట్‌ అతనే ఎందుకు కాకూడదు? అంటూ కొందరు అడివి శేష్ కి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube