Adivi Sesh Hit 2 Remuneration: మహేష్ కంటే నాని ఎక్కువ పారితోషికం ఇచ్చాడా.. శేష్ రెమ్యునరేషన్ ఎంతంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడివి శేష్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.అడివి శేష్ సినిమాలు అంటే మినిమం గ్యారంటీ సినిమాలు అని ఫ్యాన్స్ సైతం భావిస్తారు.

 Adivi Sesh Remuneration For Hit2 Movie Details, Adivi Sesh , Hit 2 Movie, Adivi-TeluguStop.com

అడివి శేష్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా ఆ సినిమాల ద్వారా నిర్మాతలకు సైతం కళ్లు చెదిరే స్థాయిలో లాభాలు వస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.అయితే మహేష్ బాబు కంటే నాని అడివి శేష్ కు ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారట.

మేజర్ సినిమాకు పరిమితంగా రెమ్యునరేషన్ ను తీసుకున్న అడివి శేష్ హిట్2 సినిమాకు రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ ను తీసుకున్నారని సమాచారం అందుతోంది.హిట్2 సినిమా కోసం అడివి శేష్ కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం అందుతోంది.హిట్2 సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించారు.హిట్2 మూవీకి అడివి శేష్ పారితోషికం 6 కోట్ల రూపాయలు అని సమాచారం.

వరుసగా విజయాలను అందుకుంటున్న అడివి శేష్ ఈ సినిమాతో కూడా మరో సక్సెస్ ను సొంతం చేసుకుంటాననే నమ్మకాన్ని కలిగి ఉన్నారు.

Telugu Adivi Sesh, Mahesh Babu, Natural Nani, Tollywood-Movie

హిట్2 కూడా సక్సెస్ సాధిస్తే అడివి శేష్ పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.అడివి శేష్ తర్వాత ప్రాజెక్ట్ లు కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సినిమాసినిమాకు అడివి శేష్ రేంజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

Telugu Adivi Sesh, Mahesh Babu, Natural Nani, Tollywood-Movie

అడివి శేష్ కు ఇతర భాషల్లో కూడా మంచి గుర్తింపు ఉండటం అతని కెరీర్ కు ప్లస్ అవుతోంది.అడివి శేష్ సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.హిట్2 సినిమా హిందీలో కూడా థియేటర్లలో రిలీజ్ కానుంది.అడివి శేష్ వరుస సక్సెస్ లతో తన రేంజ్ ను పెంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube