హైదరాబాది అమ్మాయితో ప్రేమలో ఉన్న అడవి శేష్

ప్రస్తుతం వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్.హీరో గా ఎంట్రీ ఇచ్చినా అడవి శేష్ సరైన సక్సెస్ లేకపోవడంతో పెద్ద స్టార్స్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించి మెప్పించాడు.

 Adivi Sesh Relation With Hyderabad Girl, Tollywood, Mejor Movie, Gudachari Movie-TeluguStop.com

అయితే క్షణం మూవీతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు.తనలోని రచయితని బయటకి తీసుకొచ్చి ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యే కథను కూడా అందించాడు.

అయితే గతంలో దర్శకుడుగా చేసి చేసిన పొరపాటును మళ్ళీ చేయకుండా ఆ బాద్యతలు వేరొకరికి అప్పగించాడు.తనలోని రచయితకి పదును పెట్టి గూడచారి, ఎవరు సినిమాలతో హిట్లని తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం ముంబై టెర్రర్ ఎటాక్ లో చనిపోయిన రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న మేజర్ మూవీలో అడవి శేష్ నటిస్తున్నాడు.

Telugu Adivi Sesh, Gudachari, Hyderabad, Mejor, Tollywood-Movie

ఈ మూవీకి కథను కూడా అతనే అందించాడు.ఇలా రచయితగా హీరోగా వరుస హిట్లతో దూసుకుపోతున్న శేష్ తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.ప్రస్తుతం తాను ఒక హైదరాబాదు అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు తెలిపాడు.

అయితే ఆ అమ్మాయి ఎవరనేది తను చెప్పలేనని పేర్కొన్నాడు.తనని పరిచయం చేసేందుకు ఇంకా ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని పేరు రివిల్ చేసేందుకు ఇష్టపడలేదు.

అయితే త్వరలో కచ్చితంగా ఆమె ఎవరు తెలుస్తుందని విషయాన్ని క్లారిటీ ఇచ్చాడు.ప్రస్తుతం అడవి శేష్ ప్రేమ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరి ఈ కుర్ర హీరో మనసు దోచిన ఆ హైదరాబాద్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube