నాలోని రచయిత నన్ను హీరోగా నిలబెట్టాడు అంటున్న అడవి శేష్

కర్మ హీరోగా కెరియర్ స్టార్ట్ చేసిన నటుడు అడవి శేష్.ప్రముఖ నవలా రచయిత అడవి బాపిరాజు మనవడుగా అందరికి సుపరిచ్తం అయిన అడవి శేష్ అన్న అడవి సాయి కిరణ్ వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు వంటి సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

 Adivi Sesh Open Up His Writing Skills-TeluguStop.com

అయితే అన్నదారిలో కాకుండా అడవి శేష్ నటుడుగా కెరియర్ ప్రారంభించాడు.అయితే ఆరంభంలో అనుకున్న స్థాయిలో సక్సెస్ రాలేదు.

అయితే క్షణం సినిమాతో అతని కెరియర్ టర్న్ అయిపోయింది.ఆ సినిమాతో రచయితగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు.

 Adivi Sesh Open Up His Writing Skills-నాలోని రచయిత నన్ను హీరోగా నిలబెట్టాడు అంటున్న అడవి శేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

లోబడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మంచి హిట్ అయ్యింది.ఈ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా గూఢచారి, ఎవరు సినిమాలతో ఓ వైపు రచయితగా మరో వైపు హీరోగా తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో సత్తా చాటాడు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రొడక్షన్ లో ముంబై టెర్రర్ ఎటాక్స్ లో చనిపోయిన సందీప్ ఉన్నికృష్ణన్ రియల్ లైఫ్ స్టొరీతో మేజర్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో కూడా టైటిల్ రోల్ పోషించడంతో పాటు కథ, స్క్రీన్ ప్లే అందించాడు.

మరో వైపు గూఢచారి సీక్వెల్ కూడా స్టార్ట్ చేశాడు.

ఇదిలా ఉంటే అడవి శేష్ తాజాగా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరియర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

రచయితగా ఉండటం నటుడిగా అతని ఎంపికలను ప్రభావితం చేస్తుందా అని ఇంటర్వ్యూలో అడిగిన మాటకి సమాధానంగా కెరీర్ ప్రారంభంలో రాయడం తప్పనిసరి అయ్యేది.ఎందుకంటే మనకు ఒక కథ నచ్చినప్పుడు మనం తెరపై దానిని చూడాలనుకుంటాం.

అయినా నేను ఆ రకమైన సినిమాలు హీరోగా పొందలేకపోయాను.చాలా కారణాల వలన రచన నా ఆయుధంగా మారింది.

కలంతో నేను యుద్ధానికి వెళ్ళగలను.నాలో ఉన్న రచయితనే ఈ రోజు హీరోగా నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాడు.

అందుకే రచన అనేది నాకు ఎప్పటికి బలం అవుతుంది తప్ప ఇబ్బందికాదని అడవి శేష్ చెప్పడం విశేషం.

#Writing Skills #Adivi Sesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు