Adivi Sesh Mahesh babu : మహేష్ బాబుతో మాట్లాడినప్పుడు కన్నీళ్లు వచ్చాయ్.. అడవి శేష్ వైరల్ కామెంట్స్!

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో తాజాగా నటించిన చిత్రం హిట్ 2.ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించగా హీరో నాని నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే.

 Adivi Sesh Mahesh Babu Feel Proud Me , Adivi Sesh, Hit 2, Mahesh Babu, Emotional-TeluguStop.com

తాజాగా విడుదల అయినా ఈ సినిమా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ ల వర్షం కురిపిస్తూ దూసుకుపోతోంది.హిట్ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో చిత్ర బృందం ప్రస్తుతం భాగంగా ఎంజాయ్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా మంచి సక్సెస్ అయిన సందర్భంగా తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో కలిసి ముచ్చటించారు హీరో అడవి శేష్.

ఈ నేపథ్యంలోనే ఒక అమ్మాయి మనం డేట్‌ కి ఎప్పుడు వెళ్దాం అని అడగగా ఇదిగో వచ్చేస్తున్నాను, కలిసి హిట్‌ 2 చూసేద్దామా? అని సరదాగా బదులిచ్చాడు శేష్.మరొక నెటిజన్ హిట్‌ యూనివర్స్‌ లోకి మహేశ్‌ బాబులాంటి పెద్ద స్టార్‌ను ఇన్వాల్వ్‌ చేయండి అన్న నెక్స్ట్‌ లెవల్‌ కు వెళ్లిపోద్ది.ఎప్పటినుంచో నువ్వు ఎంచుకునే థ్రిల్లింగ్‌ స్టోరీలలో మహేశ్‌బాబుని చూడాలని కోరిక.

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ లైన్‌ రాసి మహేశ్‌ అన్నతో చేయండి అన్న.అని ట్వీట్‌ చేయగా ఆ ట్వీట్ పై అడవి శేష్ స్పందిస్తూ.

ఈరోజు ఉదయమే ఆయన ఫోన్‌ చేసి చాలాసేపు మాట్లాడారు.నా విషయంలో గర్వంగా ఉన్నట్లు తెలిపారు.

అప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.సోదరుడిగా తన వెన్నంటే ఉంటానని మాట ఇచ్చాను.

Telugu Adivi Sesh, Mahesh Babu, Tollywood-Movie

ఆయనకు హిట్‌ 2 ఎప్పుడెప్పుడు చూపించాలా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని రీ ట్వీట్‌​ చేశాడు అడవి శేష్.ఇకపోతే హీరో అడవి శేష్ విషయానికి వస్తే.ఈ మధ్యకాలంలో మంచి ప్రాధాన్యం ఉన్న కథలను ఎంచుకుంటూ వరుసగా హిట్ టాక్ లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు అడవి శేష్.ఇటీవలే విడుదల అయిన గూడచారి, మేజర్ లాంటి సినిమాలు మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక తాజాగా విడుదల అయిన హిట్ 2 సినిమా కూడా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube