హైదరాబాద్ ఎన్నికల వేళ ఓటు హక్కు గురించి క్లాస్ తీసుకున్న అడవి శేష్  

adivi sesh comments on ghmc elections, Tollywood, Hyderabad, Telangana Politics, TRS Party, Social Media - Telugu Hyderabad, Social Media, Telangana Politics, Tollywood, Trs Party

టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు అడవి శేష్.ఓ వైపు హీరోగా మరో వైపు రచయితగా తన సత్తా చూపిస్తూ హిట్ మీద హిట్ కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

TeluguStop.com - Adivi Sesh Comments On Ghmc Elections

ప్రస్తుతం అడవి శేష్ గూఢచారి సీక్వెల్ ఒక ప్లాన్ చేస్తున్నాడు.అలాగే ప్రస్తుతం మేజర్ షూటింగ్ లో ఉన్నాడు.

ఇదిలా ఉంటే ఈ కుర్ర హీరో తాజాగా ఓటు హక్కు గురించి చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల వేళ అతని వాఖ్యలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి.

TeluguStop.com - హైదరాబాద్ ఎన్నికల వేళ ఓటు హక్కు గురించి క్లాస్ తీసుకున్న అడవి శేష్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఓటు అనేది ఎప్పుడూ ఎంతో ముఖ్యమైనది.హైదరాబాద్ లో ప్రస్తుతం ఉన్న వాతావరణానికి ఇంకొంచెం అభివృద్ధి జరిగితే బాగుంటుంది.

మణికొండ లాంటి ప్రాంతాల్లో మాటిమాటికీ బోర్లు వేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న గ్రౌండ్ వాటర్ ని ఎక్కువగా తోడేస్తున్నాం.

భారీ నిర్మాణాలు, సిమెంటు రోడ్లతో ప్రతికూల పరిస్థితి ఏర్పడింది.

హైదరాబాద్ లోని పర్యావరణాన్ని మనం ఇంకొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.ఈ నేపధ్యంలో ఓటు హక్కు అన్నది మనకున్న బ్రహ్మాస్త్రం.

ఓటు ద్వారా మన ప్రశ్నలకు సమాధానం దొరికినా దొరక్కపోయినా నాయకులకు మనం ఇచ్చే విలువ ఏంటి అంటే ఓటు వేయడమే అని శేష్ కామెంట్స్ చేశాడు.గ్రేటర్ ఎన్నికల వేళ అతడి కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇంతకీ అడవి శేష్ చేసిన ఈ వాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేసినవి అనేది అర్ధం కాకున్నా ఓటు హక్కుని సరైన విధంగా ఉపయోగించుకోవడం ద్వారా సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవచ్చనే విషయాన్ని అడవి శేష్ తన కామెంట్స్ ద్వారా తెలియజేశాడు.

#Social Media #Hyderabad #Trs Party

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Adivi Sesh Comments On Ghmc Elections Related Telugu News,Photos/Pics,Images..