ఆర్‌ఆర్‌ఆర్‌ పై ఆదివాసీల నిరసన  

Adivasis tribals fight against RRR movie , Adivasis, NTR Muslim Getup, RRR Movie, Rajamouli, NTR, Ram Charan, Tribals, Komaram Bheem - Telugu Adivasis, Adivasis Tribals Fight Against Rrr Movie, Komaram Bheem, Ntr, Ntr Muslim Getup, Rajamouli, Ram Charan, Rrr Movie, Tribals

రాజమౌళి దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న ఆర్‌ఆర్ఆర్‌ సినిమా నుండి హీరోల లుక్స్‌ వచ్చేశాయి.ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ లుక్‌ ఇటీవలే విడుదల చేయడంతో సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి.

TeluguStop.com - Adivasis Tribals Fight Against Rrr Movie

అంచనాలకు తగ్గట్లుగా జక్కన్న హాలీవుడ్‌ స్టాండర్డ్స్‌ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను స్వాతంత్ర్యంకు పూర్వం పరిస్థితుల నేపథ్యంలో తీస్తున్నట్లుగా చెప్పారు.

కాని వీడియోలు చూస్తుంటే మాత్రం ఇది స్వాతంత్ర్య పోరాట సినిమా కాదనిపిస్తుంది.హీరోల పేర్లు అల్లూరి సీతారామరాజు మరియు కొమురం భీమ్‌లు అనే మాట వాస్తవమే కాని కథ మొత్తం కల్పితం.

TeluguStop.com - ఆర్‌ఆర్‌ఆర్‌ పై ఆదివాసీల నిరసన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

వారిద్దరి పాత్రలను తీసుకుని కల్పిత కథతో దర్శకుడు జక్కన్న సినిమాను చెక్కుతున్నాడు.కనుక సినిమా ఖచ్చితంగా బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాపై ఆదివాసీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఆదివాసీల బిడ్డ అయిన కొమురం భీమ్‌ పాత్రకు ముస్లీం టోపీ పెట్టడం ఏంటీ అంటూ ఆగ్రహంతో ఉన్నారు.

ఆదివాసీల మనో భావాలను దెబ్బ తీసే విధంగా ఉన్న ఆ సీన్‌ ను మరియు ఫొటోలను వెంటనే తొలగించాలంటూ నిరసన వ్యక్తం చేశారు.ఈ విషయమై తాము పోరాటాకి కూడా సిద్దంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు.

ప్రస్తుతం చిత్రీకరణతో బిజీగా ఉన్న జక్కన్నకు ఇదో తలనొప్పిగా మారింది.కొమురం భీమ్‌ పాత్ర పేరు అయినా కూడా ఆయన జీవితానికి ఆ సినిమా కథకు ఎలాంటి సంబంధం ఉండదని చెబుతున్నా కూడా పట్టించుకోకుండా నిరసనకు దిగుతున్నారు.

వారితో జక్కన్న ఏమైనా చర్చలు జరుపుతాడా లేదంటే వారే కొన్ని రోజులు హడావుడి చేసి ఆ తర్వాత ఆగుతారో చూడాలి.రాజమౌళి ఈ సినిమాను త్వరలోనే పూర్తి చేసి వచ్చే ఏడాదిలో విడుదల చేయాలని ఉవ్విల్లూరుతున్నాడు.

వెయ్యి కోట్ల టార్గెట్‌ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

#Ram Charan #Komaram Bheem #Adivasis #Rajamouli #AdivasisTribals

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Adivasis Tribals Fight Against Rrr Movie Related Telugu News,Photos/Pics,Images..