బాలకృష్ణ ఆ రెండు సినిమా సీక్వెల్స్! ఇప్పుడు వంద కోట్లు పైనే బడ్జెట్  

Aditya 369 Bhairava Dweepam Sequels - Telugu Aditya 369, Balakrishna, Bhairava Dweepam Sequels, Pan India Movies, South Cinema, Telugu Cinema, Tollywood

బాలకృష్ణ కెరియర్ లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్న కూడా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.అందులో ఆదిత్యా 369, భైరవద్వీపం ఎప్పుడు ప్రత్యేక స్థానం కలిగి ఉంటాయి.

 Aditya 369 Bhairava Dweepam Sequels

సింగీతం శ్రీనివాసరావు అంటే అప్పట్లోనే హాలీవుడ్ స్టాండర్డ్స్ లో టెక్నికల్ వేల్యూస్ తో సినిమాలు తీసే దర్శకుడుగా తనదైన ముద్ర వేశాడు.అలాంటి దర్శక దిగ్గజంతో బాలకృష్ణ చేసిన ఈ రెండు సినిమాలలో ఒకటి సైన్స్ ఫిక్షన్ సినిమా కాగా, మరొకటి జానపద కథ.

టైం మిషన్ నేపధ్యంలో నడిచే కథాంశంతో ఆదిత్య 369 ఉంటుంది.ఇప్పటికి అలంటి సినిమా మరొకటి మన తెలుగు దర్శకులు తీయలేకపోయారు.

బాలకృష్ణ ఆ రెండు సినిమా సీక్వెల్స్ ఇప్పుడు వంద కోట్లు పైనే బడ్జెట్-Movie-Telugu Tollywood Photo Image

ఇక భైరవద్వీపం అంటే పాతాళభైరవి సినిమా స్ఫూర్తితో సింగీతం చేసిన ఈ జానపద కథాంశం అద్భుతమైన విజయం అందుకుంది.

ఈ రెండు సినిమాలకి ఇప్పుడు సీక్వెల్స్ తీయాలని ప్లాన్ చేస్తున్నారు.

అయితే అప్పట్లో టెక్నికల్ వండర్ గా తీసిన ఆ సినిమా కథాంశం భాగుండటంతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.అయితే ఇప్పుడు వీటికి సీక్వెల్స్ తీయాలన్న, లేదంటే అదే కథలని ప్రెజెంట్ కి తగ్గట్లు మార్చి రీమేక్ చేయాలన్నా కత్తికి మించిన సామే అవుతుంది.

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ఈ సినిమాలని విజువల్ వండర్ గా ఆవిష్కరించాలి.అలా ఆవిష్కరించాలంటే కచ్చితంగా వందల కోట్ల బడ్జెట్ ని నిర్మాతలు సిద్ధం చేసుకోవాలి.

అయితే బాహుబలి పుణ్యమా అని వందల కోట్ల బడ్జెట్ అనేది ఇండియన్ సినిమాకి పెద్ద సమస్య కాదు.కాని వాటికి సీక్వెల్స్ అంటి ఆ స్థాయిలో కథాంశాలు మళ్ళీ రచయితలు సిద్ధం చేయాలి.

అలాగే వాటిని బాలకృష్ణతో తీయడం అంటే సాహసమే అని చెప్పాలి.ఈ నేపధ్యంలో ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ రెండు సినిమా సీక్వెల్స్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందా, ఉంటే వీటిని ఎవరు సింగీతంని మరిపించే విధంగా ఆవిష్కరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Aditya 369 Bhairava Dweepam Sequels Related Telugu News,Photos/Pics,Images..

footer-test