నానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంతరిక్షం భామ!  

ఇంద్రగంటి దర్శకత్వంలో నానికి జోడీగా నటించడానికి ఒకే చెప్పిన అదితిరావ్ హైదరీ. .

Aditi Rao To Romance With Natural Star Nani-indraganti Mohana Krishna,romance With Natural Star Nani,south Cinema,telugu Cinema,tollywood

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం జెర్సీ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. మరో వైపు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ సినిమా షూటింగ్ ని త్వరలో ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. దీంతో పాటు తనని హీరోగా పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో మూడో సినిమాకి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు...

నానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అంతరిక్షం భామ!-Aditi Rao To Romance With Natural Star Nani

దీనిని కూడా సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి నాని రెడీ అయిపోతున్నాడు. మొత్తానికి ఈ ఏడాదిలో మూడు సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలనే టార్గెట్ తో నాని ఫుల్ బిజీ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.ఇదిలా వుంటే విక్రమ్ కె కుమార్ గ్యాంగ్ లీడర్ సినిమా కోసం కాస్టింగ్ ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే మోహన కృష్ణ సినిమా కోసం కాస్టింగ్ ఫైనల్ చేసే ప్రయత్నంలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నానికి జోడీగా అదితి రావ్ హైదరీని దర్శకుడు ఫైనల్ చేసాడని తెలుస్తుంది. అదితి రావ్ ని టాలీవుడ్ స్క్రీన్ కి పరిచయం చేసి సక్సెస్ ఇచ్చిన ఇంద్రగంటి మీద ఉన్న అభిమానంతో ఆమె నానికి జోడీగా నటించడానికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.