కాస్టింగ్ కౌచ్ వలనే సినిమాలు చేయలేకపోయా - అదితి రావు

కాస్టింగ్ కౌచ్.గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీని కలవరపెడుతున్న విషయం.

 Aditi Rao Hydari Says Casting Couch Exist In Bollywood-TeluguStop.com

సినిమా రంగంలో లైంగిక వేధింపులు ఎక్కువని,పడుకుంటేనే అవకాశాలిస్తారంటూ కొద్దికాలం క్రితం శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యాలు సంచలనం సృష్టించాయి.సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ పై ఒక్కో తార గళం విప్పుతూమరిన్ని విషయాలు వెల్లడిస్తున్నారు.

హైదరాబాద్ బ్యూటీ అదితి రావు దక్షిణాది భాషలతోపాటు బాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇటీవల సమ్మోహనంలో తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు.ప్రస్తుతం వరస ఆఫర్లతో దూసుకుపోతున్న అదితి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వలనే సినిమాలు చేయలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు…

కొంత మంది నిర్మాతలు అర్ధరాత్రుళ్లు తనను తమ గదికి రమ్మనేవారని బాలీవుడ్ తార మల్లికా శెరావత్ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.తాజాగా కథానాయిక అదితి రావు హైదరీ కూడా కాస్టింగ్ కౌచ్‌పై తన గళం విప్పారు.హీరోలతో అలా ఉండనందుకే తనకు పలు కీలక పాత్రలు దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.2006లో మలయాళ సినిమా ద్వారా నటిగా పరిచయమైన అదితి ఆ తర్వాత ఎనిమిది నెలల పాటు సినిమాలకు దూరమయ్యారు.దీనికి గల కారణాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.‘నేను సినిమాలోకి వచ్చి పదేళ్లు దాటింది.కాస్టింగ్ కౌచ్ కారణంగానే ఎక్కువ సినిమాలు చేయలేకపోయా.కెరీర్ ఆరంభంలో ఓ బాలీవుడ్ నిర్మాత నా దగ్గరకు వచ్చాడు.

ఆఫర్ ఇస్తానని, కాంప్రమైజ్ కావాలని కోరాడు.నాకు చాలా కోపం వచ్చింది’ అని ఆమె తెలిపారు.

తప్పుడు దారుల్లో అవకాశాలు దక్కించుకోవాల్సిన అవసరం తనకు లేదని, తన ప్రతిభనే నమ్ముకున్నానని అదితి చెప్పారు.చాలా రోజులు ఖాళీగా ఉండిపోయినా.ప్రతిభ ఉండి, నిజాయతీగా ఉంటే సినిమాల్లో రాణించవచ్చని తెలుసుకున్నానని ఆమె అన్నారు.ఆ తర్వాత అవకాశాలు వాటంతటవే అవే తలుపుతట్టాయని వెల్లడించారు.

ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు తీవ్రంగానే ఉన్నాయని చెప్పిన అదితి.పేర్లు చెప్పడానికి మాత్రం ఇష్టపడలేదు…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube