అదితిరావు మరో రకుల్‌ కానుందా?

సినిమా పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం, ఎప్పుడు ఎలాంటి రంగు ఉంటుందో అర్థం కాదు.నేడు చిన్న హీరోయిన్‌గా ఉన్న వారు రేపటికి స్టార్స్‌ అవ్వొచ్చు, నేడు స్టార్‌ హీరోయిన్‌గా ఉన్న వారు రేపటికి అవకాశాలు లేక బిక్క మొహం వేసుకున్న సందర్బాలు ఎన్నో ఉన్నాయి.

 Aditi Rao Hydari Is Like A Rakulpreet-TeluguStop.com

ఇక విషయానికి వస్తే రెండు సంవత్సరాల క్రితం ‘చెలియా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అదితిరావు ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు.ఇతర భాషల్లో అడపా దడపా చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు తాజాగా సుధీర్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సమ్మోహనం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నటిగా అదితి రావు మరోసారి ఆకట్టుకుంది.‘చెలియా’ చిత్రంలో ఈ అమ్మడి నటన బాగున్నా కూడా నిర్మాత మరియు దర్శకుల దృష్టిలో పడలేదు.కాని ఈసారి మాత్రం ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది.సమ్మోహనం చిత్రంలో ఒక స్టార్‌ హీరోయిన్‌ పాత్రను ఈమె పోషించింది.ఆ పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసిందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అన్ని ఫీలింగ్స్‌ను చక్కగా కనబర్చి అద్బుతమైన ప్రతిభతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ అదితి రావుకు ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉంది.

ఈ అమ్మడితో సినిమాలు చేసేందుకు స్టార్‌ హీరోలు సైతం ఆసక్తిగా ఉన్నారు.

గతంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చిన్న సినిమాలు చేస్తూ ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌ అయిన విషయం తెల్సిందే.

తెలుగులో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించి, తెలుగు టాప్‌ హీరోయిన్స్‌ జాబితాలో చేరడంతో పాటు, లక్కీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.ఇప్పుడు అదే పరిస్థితి అదితి రావుకు రాబోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే ఈ అమ్మడు ఒక మెగా మూవీలో ఛాన్స్‌ను దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది.ఆమెగా హీరో చేయబోతున్న సినిమాపై ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు.భారీ అంచనాలున్న ఆ సినిమాలో అదితికి ఛాన్స్‌ రావడం ఆమె లక్కీ హీరోయిన్‌గా మారడంకు బాటలు వేస్తోంది.

చాలా కాలంగా సుధీర్‌బాబు సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్నాడు.

ఈ సమయంలో అదితిరావు కారణంగా సుధీర్‌బాబుకు సక్సెస్‌ దక్కింది.ఆ దిశగా కూడా ముద్దుగుమ్మ అదితి రావుకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

అదితితో చేస్తే తప్పకుండా సక్సెస్‌ ఖాయం అంటూ కొందరు నమ్ముతున్నారు.అందుకే హీరోలు సైతం ఈమెతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈ సంవత్సరం మరో రెండు చిత్రాలతో ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.ఇక వచ్చే సంవత్సరంలో ఈమె చేసే సినిమాల సంఖ్య భారీగా ఉంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube