సెలబ్రెటీలు చేసే మంచి కంటే చెడునే మీడియా చూపిస్తుంది... అదితీరావ్ వాఖ్యలు

గ్లామర్ ప్రపంచం అంటే ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.తెరపై కనిపించే నటులు, వారి జీవితాల గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ప్రతి ఒక్కరిలో ఉంటుంది.

 Aditi Rao Hydari Comments On Media Negative Publicity, Tollywood, Bollywood, Cel-TeluguStop.com

అయితే తెరపై కనిపించిన నటులు కూడా మనం ఉన్న సమాజంలో మనలాగే బ్రతుకుతున్న వారు అనే విషయాన్ని చాలా మంది గుర్తించరు.నిజానికి సెలబ్రిటీలు ఏం చేసినా ప్రజలు వాటిని ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు.

అందుకే చాలా వ్యాపారాలు వాళ్ళ ఇమేజ్ తోనే నడుస్తాయి.పలనా సెలబ్రిటీ పలానా ప్రోడక్ట్ బ్రాండ్ అంబాసిడర్ అంటా.

అంటూ జరిగే ప్రచారంతోనే ఆ ప్రోడక్ట్ బిజినెస్ జరిగిపోతుంది.ఇంతలా సమాజం మీద వారి ప్రభావం ఉంటుంది.

మంచి చేస్తే మంచిగా, చెడు చేస్తే చెడుగా రిఫ్లెక్ట్ అవుతుంది.ఈ కారణంగానే దేశంలోనే మీడియా రాజకీయం, సామాజిక పరిస్థితుల మీద కంటే సినిమా మీద, సెలబ్రిటీల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది.

సినిమా ఇండస్ట్రీకి చెందిన వార్తలని ప్రచారం చేయడం ద్వారా ఎక్కువ మైలేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాయి.

ఇలా మీడియా చేసే అతి కారణంగా సమాజంలో ఎన్ని ఘోరాలు చేసిన పెద్దగా కనిపించవు.

కాని సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఏవైనా తప్పులు చేస్తే వాటిని బూతద్దంలో పెట్టి చూపించడం వలన సినిమా ఇండస్ట్రీ మీద ప్రజలలో కూడా ఒక చెడు అభిప్రాయం ఉంది.సినిమా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు అని, హీరోయిన్స్ అయితే ఇష్టానుసారం రోజుకొక బాయ్ ఫ్రెండ్ ని మార్చేస్తారు అంటూ కథలు కథలుగా చెప్పుకుంటారు.

చిత్ర పరిశ్రమని మీడియానే ఈ విధంగా ప్రోజెక్ట్ చేస్తూ చూపిస్తుంది.వారు చేసే పని పనులు, సామాజిక అంశాలపై పెద్ద శ్రద్ధ పెట్టదు.ఈ విషయంలో చాలా మంది సెలబ్రిటీలు, చాలా సందర్భాలలో మీడియా మీద తమ అసహనం ప్రదర్శించారు.ఈ జాబితాలో అదితీరావ్ హైదరీ కూడా చేరింది.

కరోనా సమయంలో ప్రజల కోసం చాలా మంది సినీ తారలు మంచి పనులు చేశారు.అయితే మంచిని దాచి కేవలం చెడు మాత్రమే మీడియా హైలెట్ చేస్తున్నారు.

దీంతో ప్రజలు దాని గురించి మాత్రమే మాట్లాడుతారు.కేవలం ప్రతికూలంగా కాకుండా సానుకూలతపై కూడా దృష్టిపెట్టాలని నేను కోరుకుంటున్నాను అంటూ అదితీరావ్ పేర్కొంది.

అంతేకాదు మేము ఏం మాట్లాడినా అందులో ఒక్క తప్పు పదం దొరికినా వెంటనే టార్గెట్ చేస్తారు.తప్పు మాట్లాడిన వారిపై అందరూ విమర్శలకు దిగుతారు.

అలాగని ఏం మాట్లాడకపోయినా తప్పు పడతారు.ప్రతీదానికి సినీ పరిశ్రమని టార్గెట్ చేస్తారా ఒక అలవాటుగా మీడియాకి మారిపోయింది అంటూ తన ఆవేదనని తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube