నేను చాలా సెన్సిటివ్ అంటున్న అదితీరావ్ హైదరీ

హీరోయిన్స్ తెరపై కనిపించే నవ్వు, అందం, నటన చూసి వారిని చాలా మంది ఫాలో అవుతూ ఉంటారు.అలాగే సినిమా తారాలు అంటే కోట్లలో రెమ్యునరేషన్ లు తీసుకొని ఖరీదైన లైఫ్ ని లీడ్ చేస్తూ భాగా ఎంజాయ్ చేస్తారని, వారికి కష్టాలంటే పెద్దగా తెలియవని అందరూ భావిస్తూ ఉంటారు.

 Aditi Rao Hydari: An Actor's Rejection Is So Personal, Tollywood, Bollywood, Bol-TeluguStop.com

వాళ్లకి ఏం కష్టాలు ఉంటాయ్ లే అని సింపుల్ గా తీసి పారేస్తూ ఉంటారు.అయితే ఎంత పెద్ద స్టార్స్ అయిన వెండితెర మీద కనిపించినంత అందంగా వారి జీవితాలు బయట ఉండవనేది చాలా తక్కువ మందికి తెలుసు.

వారు యాక్టర్స్ కంటే ముందుగా మనలాంటి సామాన్య మనుషులే.వారికి అన్నిరకాల ఎమోషన్స్, బాధలు, కష్టాలు ఉంటాయి.

అయితే వాటిని దాటుకుంటూ ముందుకి వెళ్తూ ప్రేక్షకులకి వినోదం అందించడం కోసం కష్టంలో ఉన్నా కూడా తెరపై నవ్వుతూ, నవ్విస్తూ కనిపించాల్సి ఉంటుంది.అయినా యాక్టింగ్ అనేది వారి వృత్తి కాబట్టి బాధని లోపల దాచుకొని బయటకి నిండుగా కనిపించే ప్రయత్నం చేస్తారు.

అందరికంటే ఎక్కువ సెన్సిటివ్ గా సినీ తారలే ఉంటారు.

ఇదే విషయాన్ని ఇప్పుడు మన హైదరాబాదీ అందం.

బాలీవుడ్ భామ అదితీరావ్ హైదరీ తన ఫీలింగ్స్, ఎమోషన్స్ ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.సినీ ప్రపంచంలో ఎంతోమంది సినీతారలు కెరీర్ ఆరంభంలో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు.

అలాంటి వారిలో నేను కూడా ఉన్నాను.జీవితంలో తిరస్కరణ పొందటం అనేది వ్యక్తిగత భావాలను ఎంతో బాధిస్తుంది.

నేను చాలా సెన్సిటివ్.ఒక నటిగా థిక్ స్కిన్ తో ఉండటం అనేది చాలా కష్టం.

కానీ జీవితంలో విమర్శలు అనేవి ఒక భాగమే.ఇతరులతో పోల్చడం ఎల్లప్పుడూ కిందికి లాగే ప్రయత్నం చేయడం వేలెత్తి చూపించేందుకు ట్రై చేస్తుంటారు.

ప్రతిదీ నేను అనుభవం చేయగలను.నేను ఎంతగట్టిగా నవ్వుతానో, అంతేగా బిగ్గరగా ఏడవగలను అదేం పెద్ద విషయం కాదు.

కానీ సెన్సిటివ్ పరంగా నేను యాక్టర్ అయినా మనిషినే కాబట్టి నా జీవితంలో కూడా బ్యాడ్ డేస్ వస్తుంటాయి.కానీ వాటి గురించి నేనెప్పుడూ ఆలోచించను.

ఎందుకంటే నా ఆలోచన ఎల్లప్పుడూ ముందుకే ఉంటుంది అంటూ అదితీరావ్ చెప్పుకొచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube