ఆ రెండు సినిమాలలో అదిరే అభిని తీసేశారట.. ఆ షో వల్లే?

జబర్దస్త్ షోలో సంవత్సరాల తరబడి స్కిట్లు చేస్తూ ప్రేక్షకుల అభిమాన్ని సొంతం చేసుకుంటున్న కమెడియన్లలో అదిరే అభి ఒకరనే సంగతి తెలిసిందే.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అదిరే అభి మాట్లాడుతూ ఎన్నో కీలక విషయాలను వెల్లడించారు.

 Comedian Adire Abhi Missed Two Movie Chances Because Of Jabardasth, Adire Abhi,-TeluguStop.com

నా టీమ్ లో ఉన్నవాళ్లకు స్కిట్ చేసే విషయంలో స్వేచ్ఛ ఇస్తానని అదిరే అభి అన్నారు.కొత్తగా క్యారెక్టర్ కోసం వచ్చిన వాళ్లకు సైతం తాను ఫ్రీడమ్ ఇస్తానని అదిరే అభి వెల్లడించారు.

నాకు ప్రయోగాలు చేయడం చాలా ఇష్టమని అదిరే అభి తెలిపారు.ఒకటే విధంగా వెళ్లడం ఇష్టం ఉండదని ఆడియన్స్ కు కూడా అలా చేస్తే నచ్చదని అదిరే అభి తెలిపారు.

ఈశ్వర్ సినిమా నుంచి తాను కామెడీ చేస్తూనే వచ్చానని పాయింట్ బ్లాంక్ సినిమాలో విలన్ పాత్ర చేయడానికి ముఖ్యమైన కారణం ఉందని చెప్పారు.మధ్యలో తనకు రెండు మూడు సినిమాలలో ఆఫర్లు వచ్చాయని మొదట హీరో పక్కన ఉండే క్యారెక్టర్ చేయాలని చెప్పారని అభి అన్నారు.

ఆ తర్వాత తాను జబర్దస్త్ లో కామెడీ చేయడం వల్ల సినిమాలలో కూడా కామెడీగా కనిపిస్తామని భావించి వద్దని చెప్పారని అదిరే అభి పేర్కొన్నారు.సెకండ్ లీడ్ రోల్స్ ను తాను చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్నానని అదిరే అభి చెప్పుకొచ్చారు.తాను డిఫరెంట్ గా చెప్పగలనని చెప్పటానికి వైవిధ్యం ఉన్న పాత్రలను ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నానని అదిరే అభి వెల్లడించడం గమనార్హం.

దాదాపు 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న అదిరే అభి బాహుబలి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు.అదిరే అభి తన టీమ్ లోని కంటెస్టెంట్లను కూడా బాగా చూసుకుంటారని అతని టీమ్ లో స్కిట్లు చేసే కంటెస్టెంట్లు చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube