ఎమోషనల్ అయిన అదిరే అభి.. కరోనా సోకితే అలా చేశానంటూ..?

జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన అదిరే అభి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈశ్వర్ సినిమాతో పరిచయమైన అదిరే అభి ఆ తరువాత పలు సినిమాల్లో కమెడియన్ గా పని చేయడంతో పాటు బాహుబలి2 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేయడం గమనార్హం.

 Adire Abhi Emotional In Anchor Suma Etv Cash Show-TeluguStop.com

తాజాగా క్యాష్ ప్రోగ్రామ్ కు అభి తన సోదరితో కలిసి హాజరయ్యారు.

క్యాష్ ప్రోగ్రామ్ కోసం అభి సోదరి దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చారు.షోకు వచ్చిన అన్నాచెల్లెలు, అక్కాతమ్ముడు అయిన సెలబ్రిటీలకు సుమ రాఖీ కట్టించారు.రోల్ రైడా క్యాష్ షో కోసం దుబాయ్ నుంచి వచ్చారా.? అని అడగగా పై నుంచి సామాన్లు పడుతున్నాయని అవి చూడటానికి వచ్చారని అభి చెబుతారు.అభి చెల్లిని సుమ అక్క అని పిలవగా మీరు ఏజ్ తగ్గించుకోవడానికి మా చెల్లిని అక్క అంటారా.? అని అభి పంచ్ వేస్తాడు.

 Adire Abhi Emotional In Anchor Suma Etv Cash Show-ఎమోషనల్ అయిన అదిరే అభి.. కరోనా సోకితే అలా చేశానంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత సుమ క్యాష్ యూనివర్సిటీ పేరుతో స్కిట్ చేస్తూ తాను ప్రిన్సిపిఅల్ అని చెబుతుంది.

అభి వెంటనే ఇందాక బెల్ కొడుతూ కనిపించారని పంచ్ వేస్తాడు.ఆ తరువాత సుమ అన్నీ నేనే కొడతాను ఓకేనా అంటూ పంచ్ వేస్తారు.అదిరే అభి తాను చాలా జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వచ్చిందని పడుకునే ముందు రాతి గొళ్లెం పెట్టుకోకుండా పడుకునే వాడినని ఉదయం లేస్తానో లేదో అని అలా చేసేవాడినని అదిరే అభి చెప్పారు.

ఇంట్లో అమ్మనాన్న వయస్సు ఎక్కువ కావడంతో చెల్లెలు ఇంటికి పంపించారని తను అప్పుడే దుబాయ్ నుంచి వచ్చిందని అభి అన్నారు.15 రోజులు చెల్లి వంట చేసి పెట్టి జాగ్రత్తగా చూసుకున్నారని అభి చెప్పారు.ఆ తరువాత సుమ అమ్మలాగానే అక్కైనా చెల్లైనా అని చెబుతారు.

ఆడపిల్లలు అందరూ అంతే అని సుమ చెప్పుకొచ్చారు

#Emotional #About Sister #Cash Show #Adire Abhi #Corona Positive

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు