ఆదిపురుష్ కూడా వారికే ఛాన్స్ ఇస్తాడా?  

Adipurush Will Have Only Bollywood Heroine, Adipurush, Prabhas, Om Raut, Tollywood News, Heroine - Telugu Adipurush, Heroine, Om Raut, Prabhas, Tollywood News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

TeluguStop.com - Adipurush Will Have Only Bollywood Heroine

కాగా ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టి వాటిని కూడా తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా తరువాత మరో చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.ఇక ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌కు చుక్కలు చూపెట్టేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

TeluguStop.com - ఆదిపురుష్ కూడా వారికే ఛాన్స్ ఇస్తాడా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాకు ‘ఆదిపురుష్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేయగా, ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తాడనే వార్త ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలను క్రియేట్ చేసింది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

కాగా ఈ సినిమాలో సౌత్ నుండి హీరోయిన్‌ను తీసుకుంటారని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ క్రమంలోనే కృతి సనాన్ పేరును ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎక్కువగా వినిపిస్తోంది.ఒకవేళ ఆమె ఈ సినిమాలో సెలెక్ట్ కాకపోయినా, మరో బాలీవుడ్ బ్యూటీకే అవకాశం ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

అంటే, ఏదేమైనా ఆదిపురుష్ చిత్రానికి కేవలం బాలీవుడ్ భామనే ఎంపిక చేసేందుకు ఆదిపురుష్ నిర్ణయించుకున్నట్లు తేలిపోయింది.మరి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్‌ను ఎవరు దక్కించుకుంటారో అనేది చూడాలి.

#Om Raut #Prabhas #Heroine #Adipurush

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Adipurush Will Have Only Bollywood Heroine Related Telugu News,Photos/Pics,Images..