ఆదిపురుష్‌లో మరో బాలీవుడ్ హీరో.. ఎవరంటే?  

Adipurush To Have Another Bollywood Star, Adipurush, Prabhas, Suniel Shetty, Tollywood News - Telugu Adipurush, Prabhas, Suniel Shetty, Tollywood News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా యావత్ భారత ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి లైన్‌లో పెడుతున్న సంగతి తెలిసిందే.

TeluguStop.com - Adipurush To Have Another Bollywood Star

కాగా ఆయన నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ఆదిపురుష్ ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ప్రేక్షకులు అప్పుడే ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్‌ను పెద్ద సంఖ్యలో చిత్ర యూనిట్ తీసుకుంటుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.కాగా ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ తారలు నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే పేర్కొంది.

TeluguStop.com - ఆదిపురుష్‌లో మరో బాలీవుడ్ హీరో.. ఎవరంటే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్న సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఆదిపురుష్ చిత్ర యూనిట్ సునీల్ శెట్టిని ఈ సినిమాలో నటించాల్సిందిగా సంప్రదించగా, ఆయన వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది.దీంతో ఆదిపురుష్‌లో మరో బాలీవుడ్ నటుడు కూడా నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఆదిపురుష్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.ఈ సినిమాలో ఆయన వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఇప్పటికే మంచు విష్ణు నటిస్తున్న మోసగాళ్లు చిత్రంలో సునీల్ శెట్టి నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సునీల్ శెట్టి కనిపిస్తున్నాడు.

మరి ఆదిపురుష్ చిత్రంలో సునీల్ శెట్టి ఎలాంటి పాత్రలో నటిస్తాడో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

#Suniel Shetty #Adipurush #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు