పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా(Adipurush Movie) పాన్ ఇండియా స్థాయిలో జూన్ 16 వ తేదీ విడుదల అవడానికి సిద్ధమవుతుంది.ఈ సినిమా జూన్ 16వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషలలో అత్యధిక థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో సినిమా పై భారీ అంచనాలే పెరుగుతున్నాయి.
అయితే మరోవైపు ఈ సినిమాపై కొందరు పనిగట్టుకొని నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు.ఇక రామాయణం(Ramayanam) ఇతిహాసం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి ఈ సినిమాని దళితులు చూడకూడదు అంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రామాయణ పారాయణం జరిగే చోట పవిత్రంగా ఉండాలన్నది మా నమ్మకం మా నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా ప్రసారమవుతున్నటువంటి థియేటర్లలోకి దళితులు (Dalits) ప్రవేశం లేదు అంటూ ఉన్నటువంటి ఒక సారాంశాన్ని యు వి క్రియేషన్ బ్యానర్స్ వారు పోస్ట్ చేసిన విధంగా క్రియేట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో ఈ సినిమా గురించి ఈ సినిమాని దళితులు చూడకూడదు అంటూ వస్తున్నటువంటి ఈ వార్తలపై ఆది పురుష్ టీమ్ ఘాటుగా స్పందించారు.

ఆది పురుష్ సినిమా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏ మాత్రం నిజం లేదని ఈ తప్పుడు వార్తలను కొట్టి పారేశారు.కుల, వర్ణ, మతం ఆధారంగా ఎలాంటి వివక్షను చూపకుండా సమానత్వం కోసం దృఢంగా నిలుస్తుంది.ఈ చెడును ఎదురించే క్రమంలో మాకు సహయం చేయాలని, ఈ సినిమా ప్రతి ఒక్క భారతీయుడిది అని, చెడుపై మంచి గెలుస్తుందని వెల్లడించింది టీమ్.
ఇలా ఆది పురుష్ సినిమా గురించి వస్తున్నటువంటి ఈ తప్పుడు వార్తలను ఖండిస్తూ టీం చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.అయితే ఇక ఈ సినిమాలో ప్రభాస్(Prabhas) రాముడి పాత్రలో నటించగా కృతి సనన్(Kriti Sanon) సీత పాత్రలో నటిస్తున్నారు.
