పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రెసెంట్ నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి.ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచాడు.
దీంతో ఈయన తర్వాత సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.
పాన్ ఇండియా నుండి పాన్ వరల్డ్ లెవల్లో రిలీజ్ కు రెడీ అవుతున్న సినిమా ఆదిపురుష్ కావడంతో ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రెండేళ్ల క్రితమే ఈ సినిమా ముంబై లో ప్రత్యేకమైన సెట్స్ లో తెరకెక్కించారు.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించ నున్నాడు.ప్రభాస్ ఇందులో వి షేప్ బాడీతో మెస్మరైజ్ చేయనున్నాడని టీమ్ ఇప్పటికే గర్వంగా చెబుతుంది.
ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ సినిమాలో సీత గా కృతి సనన్ నటిస్తుంది.లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.
లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.
ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల ఖర్చు చేసినట్టు టాక్.ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.ఇది 3డీ వెర్షన్ కావడంతో అభిమానవులంతా సంతోషంగా ఉన్నారు.ఇది పక్కన పెడితే.ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయినా కూడా ఇంకా ప్రొమోషన్స్ స్టార్ట్ చేయలేదు.
ఈ ఏడాది చివర డిసెంబర్ లో రిలీజ్ కాబోతున్న ఈ ఆదిపురుష్ సినిమా ఇప్పటికే ప్రొమోషన్స్ స్టార్ట్ చేసింది.
మరి ఈ సినిమా కంటే రెండు మూడు వారాలు మాత్రమే లేటుగా రిలీజ్ కాబోతున్న ఆదిపురుష్ మాత్రం షూటింగ్ పూర్తి అయినా కనీసం ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కాకపోవడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఓం రౌత్ విషయంలో డిజప్పాయింట్ అవుతున్నారు.మరి ఆదిపురుష్ టీమ్ ఎప్పుడు ప్రొమోషన్స్ స్టార్ట్ చేస్తుందో చూడాలి.