ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్‌ రాబోతున్న ప్రభాస్‌.. వెంటనే ఆ షూటింగ్‌- Adipurush Movie Shooting Break Prabhas Come Back To Hyderabad

adipurush movie shooting break prabhas come back to hyderabad , prabhas, adipurush movie shooting, maharashtra, corona, lockdown - Telugu Adipurush, Adipurush Movie Shooting, Adipurush Movie Shooting Break Prabhas Come Back To Hyderabad, Corona, Covid-19, Lockdown, Maharashtra, Prabhas

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ గత రెండు నెలలుగా ముంబయిలో మకాం వేసి ఉన్న విషయం తెల్సిందే.అక్కడ తన మొదటి హిందీ సినిమా ఆదిపురుష్‌ షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు.

 Adipurush Movie Shooting Break Prabhas Come Back To Hyderabad-TeluguStop.com

కంటిన్యూస్ గా షూటింగ్‌ చేసి సినిమాను ఫినీష్‌ చేయాలని దర్శకుడు భావించాడు.ఇటీవల షూటింగ్‌ కు బ్రేక్‌ పడింది.

కరోనా కారణంగా షూటింగ్‌ నిలిపి వేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడు ఓమ్‌ రౌత్‌ స్వయంగా మాట్లాడుతూ చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఏ ఒక్కరికి కూడా కరోనా లేదని క్లారిటీ ఇచ్చాడు.షూటింగ్‌ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు.

 Adipurush Movie Shooting Break Prabhas Come Back To Hyderabad-ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్‌ రాబోతున్న ప్రభాస్‌.. వెంటనే ఆ షూటింగ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొత్తానికి సినిమా షూటింగ్‌ అంతరాయం లేకుండా సాగుతుందని చెప్పిన వారం రోజుల్లోనే షూటింగ్‌ ను నిలిపి వేస్తున్నట్లుగా ఓమ్‌ రౌత్‌ ప్రకటించాల్సి వచ్చింది.

ప్రభాస్‌ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు తదుపరి కీలక సన్నివేశాలకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసి షూటింగ్‌ చేసిన నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభాస్‌ హైదరాబాద్‌ వచ్చేస్తున్నాడు.

మహారాష్ట్రలో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.ప్రతి రోజు 50 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్న కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ ను అమలు చేయబోతున్నట్లుగా ప్రకటించింది.

నేడు ఉదయం నుండే అక్కడ కర్ఫ్యూ వాతావరణం కనిపించబోతుంది.కనుక షూటింగ్‌ లు ఏమీ ఉండబోవు.

కనుక ప్రభాస్‌ వెనక్కు తిరిగి వచ్చినట్లుగా చెబుతున్నారు.ఇక రాధేశ్యామ్ షూటింగ్‌ ను వెంటనే మొదలు పెట్టాలని దర్శకుడికి తెలియజేయడం జరిగింది.

ఈ నెలాఖరు నుండి అనుకున్న షెడ్యూల్‌ ను ముందే రీ షెడ్యూల్‌ చేయాల్సిందిగా ప్రభాస్‌ సూచించాడు.దాంతో రాధేశ్యామ్‌ వచ్చే నెలతో పూర్తి అయ్యే అవకాశం ఉందంటున్నారు.

ఆ తర్వాత సలార్‌ ను పట్టాలెక్కిస్తానంటూ ప్రశాంత్‌ నీల్‌ కూడా వెయిట్‌ చేస్తున్నాడు.

#COVID-19 #Prabhas #AdipurushMovie #Maharashtra #AdipurushMovie

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు