ఆదిపురుష్ కోసం ఎన్నో ఏళ్లుగా రీసెర్చ్ చేస్తున్న ఓం రౌత్ !

ప్రభాస్ బాహుబలి చిత్రంతో తన స్టామినాను ఒక్కసారిగా పెంచుకున్నాడు.అంతేకాదు తన మార్కెట్ కూడా అమాంతం పెరిగింది.

 Adipurush Movie Interesting News About Om Raut-TeluguStop.com

అందుకే వరస పెట్టి అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు ఐదు సినిమాలు ఉన్నాయి.

రాధే శ్యామ్ సినిమా విడుదలకు సిద్ధం గా ఉంది.ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

 Adipurush Movie Interesting News About Om Raut-ఆదిపురుష్ కోసం ఎన్నో ఏళ్లుగా రీసెర్చ్ చేస్తున్న ఓం రౌత్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను జులై 30 న విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి.ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమాలు ప్రకటించి ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేసారు.

సలార్ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.

ఆదిపురుష్ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.రామాయణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

అయితే పురాణాల ఆధారంగా తెరకెక్కే ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తీయాలి.

అందుకే ఈ సినిమా తీయడానికి ఓం రౌత్ చాలా ఏళ్లుగా రీసెర్చ్ చేస్తున్నాడని ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాకు సంబంధించి చాలా రీసెర్చ్ చేసిన తర్వాతే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాడని టాక్.

ప్రస్తుతం ఈ సినిమాలో కీలక పాత్రల కోసం ఇంకా ఎంపికలు జరుగుతూనే ఉన్నాయి.

Telugu Adipurush Movie, Adipurush Movie Interesting News About Om Raut, Latest Updates, Om Raut, Prabhas-Movie

ఈ సినిమాలో కిచ్చా సుదీప్ రావణాసురుడి సోదరుడు విభీషణుడి పాత్రలో నటించ నున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ సినిమా కోసం స్పెషల్ గా వేసిన సెట్ లో మొన్నటి వరకు షూటింగ్ జరిగింది.కానీ ప్రస్తుతం అయితే ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.

మళ్ళీ పరిస్థితులు చక్క బడిన తర్వాత షూటింగ్ కొనసాగుతుంది.ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఆగస్టు 11 న విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ భావిస్తున్నారు.

#AdipurushMovie #Prabhas #Om Raut

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు