ఆదిపురుష్‌లో ప్రభాస్‌ను మించిన హీరో!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

 Hanuman Role To Have More Impact Than Prabhas In Adipurush, Adipurush, Hanuman,-TeluguStop.com

ఇక రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, దానికి స్టన్నింగ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.కాగా ఈ సినిమా పూర్తి కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు.

ఇప్పటికే మహానటి చిత్రం దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను పూర్తి సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’ అనే సినిమాలో నటించేందుకు ఓకే చేశాడు.ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకక్కుతుండగా, ఈ సినిమాలో ప్రభాస్ రాముడి అవతారంలో కనిపించనున్నాడు.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

కానీ ఈ సినిమాలో ప్రభాస్ చేయబోయే పాత్ర కంటే కూడా మరో పాత్ర హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది.

రామాయణంలో రాముడి పాత్రతో పాటు హనుమంతుడి పాత్ర ప్రేక్షకులను ఎప్పటికీ అలరిస్తూనే ఉంటుంది.ఈ క్రమంలోనే ఆదిపురుష్ సినిమాలో కూడా ప్రభాస్ పాత్ర కంటే కూడా హనుమాన్ పాత్ర చాలా కీలకంగా ఉండనున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి.

అయితే ఈ సినిమాలో హనుమాన్ పాత్రలో ఎవరు నటించబోతున్నారా అనే ఆసక్తి ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ మరోసారి మేకోవర్ చేస్తుండగా, ఈ సినిమాలో సీత పాత్రలో నటించేందుకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని చిత్ర యూనిట్ సంప్రదిస్తోంది.

మరి ఆదిపురుష్‌లో ప్రభాస్ కంటే ఎక్కువగా మెప్పించే హనుమాన్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube