పాత సైకిల్ తో ఈ- సైకిల్ తయారు చేసిన మెకానిక్.. గంటన్నర ఛార్జింగ్ పెడితే చాలు.. ఏకంగా..?!

Adilabad Mechanic Created A Chargeable E Cycle From Old Cycle

పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధన కర్చులేకుండా ఉపయోగించే వాహనం ఏదైనా ఉంది అంటే అది సైకిల్ మాత్రమే.అంతేకాకుండా సైకిల్ ను ఉపయోగించడం వల్ల కాలుష్యం కూడా చాలా వరకు తగ్గుతుంది.

 Adilabad Mechanic Created A Chargeable E Cycle From Old Cycle-TeluguStop.com

అయితే మారుతున్న కాలానుగుణంగా కార్లు, బస్ లు, స్కూటర్లు, ఆటోలు అంటూ రకరకాల వాహనాలు వచ్చేసాయి.దీంతో చాలా వరకు సైకిల్ వాడకం తగ్గిపోయింది.

ఇంట్లో ఉన్న సైకిల్ లు ఓ మూలన పడిపోతున్నాయి.అయితే కనుమరుగవుతున్న పాత సైకిల్ ను ఉపయోగించి ఓ మెకానిక్ ఛార్జింగ్ తో నడిచే ఈ- సైకిల్ తయారు చేసాడు.

 Adilabad Mechanic Created A Chargeable E Cycle From Old Cycle-పాత సైకిల్ తో ఈ- సైకిల్ తయారు చేసిన మెకానిక్.. గంటన్నర ఛార్జింగ్ పెడితే చాలు.. ఏకంగా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన అబ్దుల్ జలీల్ కేవలం రూ.6,200 ఖర్చు పెట్టి పాత సైకిల్ ను విజయవంతంగా ఈ- సైకిల్ గా మార్చారు.20 ఏళ్లుగా బైక్ మెకానిక్ అనుభవం ఉన్న జలీల్ తన ఆలోచనతో పంటల పై రసాయన మందు పిచికారీ చేసే యంత్రంలో ఉపయోగించే 8.12 వోల్టుల రెండు బ్యాటరీలు, చైనా మోడల్ కిట్ (ఎక్స్ లేటర్, మోటార్) అమర్చి ఈ – సైకిల్ ను తయారు చేసినట్టు జలీల్ తెలిపారు.

మొదటగా ఈ ప్రయోగం పాత సైకిల్ తో చేసినట్టు జలీల్ తెలిపారు.అయితే ఈ- సైకిల్ కు గంటన్నర ఛార్జింగ్ పెడితే గంటకు 20 కిలోమీటర్ల వేగంతో 20 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని ఆయన తెలిపారు.త్వరలో రూ.21000 తో నూతన సైకిల్ తో పాటు 40 కిలోమీటర్లు ప్రయాణించే సైకిల్ ను తయారు చేస్తానని చెప్పారు.అలాగే మధ్య వయసున్న పేద, మధ్య తరగతి వారు ఈ- సైకిల్ ను ఉపయోగించవచ్చునని తెలిపారు.

#Abdul Jallel #Cycle #Cycle #Cycle #Mechanic

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube